twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్చ్... చివరి నిముషంలో వాయిదా

    By Srikanya
    |

    హైదరాబాద్: సాధారణంగా రిలీజ్ డేట్ ఒకసారి ప్రకటించాక దాన్ని మార్చటానికి దర్శక,నిర్మాతలు ఇష్టపడరు. అయితే ఫైనాన్సియల్ సమస్యలు,టెక్నికల్ రీజన్స్ తో ఒక్కోసారి అనుకున్న సమయానికి విడుదల చెయ్యలేని పరిస్ధితి ఏర్పడుతుంది. ప్రస్తుతం నిఖిల్, స్వాతి కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'కార్తికేయ'అదే పరిస్ధితి ఎదుర్కొంటోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాని ఆగష్టు 1న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఆగష్టు 1 నుండి వాయిదా వేసారు. ఈ విషయాన్ని చిత్రం హీరో నిఖిల్ సోషల్ నెట్ వర్కింగ్ మీడియా ద్వారా తెలియచేసారు. రెండు మూడు రోజుల్లో తదుపరి రిలీజ్ తేదిని ప్రకటిస్తామన్నారు.

    నిఖిల్ ట్వీట్ చేస్తూ... కార్తికేయ మొదటి కాపీ రెడీ అయ్యింది. సెన్సార్ కు పంపుతున్నాం. అయితే ఆగస్టు 1 న విడుదల చెయ్యాలంటే ఇది బాగా లేటు. ..మూడు నాలుగు రోజుల్లో రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం. అలాగే కార్తికేయ టీమ్ ఇరవై నాలుగు గంటలూ ఈ సినిమా పనిలో నే ఉంటోంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ కార్తిక్ ల గురించి చెప్పుకోవాలి. అలాగే ... సినిమా మేకింగ్ లో ...విడుదల తేది సరైనది నిర్ణయించటం కూడా ఓ భాగమే. త్వరలోనే ఆ తేదిని మీకు చెప్తాను అన్నారు.

    Karthikeya to miss August 1st date

    శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ధ్రిల్లర్‌తో కూడిన వినొదాత్మక చిత్రంగా దీనికి రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు. చిత్ర హీరో,హీరోయిన్స్ వైద్య విద్యార్ధులుగా కనిపిస్తారీ చిత్రంలో.. ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదు.. ఒక వేళ సమాధానం దొరకలేదు అంటే ఆ లోపం ప్రశ్నది కాదు, ప్రయత్నానిదే అని నమ్మే మనస్తత్వం చిత్ర హీరో 'నిఖిల్'ది. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన సంఘటనలు, సన్నివేశాల సమాహారమే ఈ 'కార్తికేయ' చిత్రం.

    ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళ భరణి, నాజర్, రావు రమేష్, ప్రవీణ్, తులసి, కిషోర్, స్వామిరారా సత్య, జోగినాయుడు, శివన్నారాయణ, మీనాకుమారి, చంద్రశేఖర్ గిరి, కృష్ణంరాజు, వేణుగోపాలరావు, ఐ కె. త్రినాధ్ తదితరులు నటిస్తున్నారు.

    ఈ చిత్రానికి కెమేరా: కార్తీక్ ఘట్టమనేని. ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: శేఖర్ చంద్ర, పాటలు: కృష్ణ చైతన్య, కొరియో గ్రఫీ: రఘు, ఆర్ట్: సాహి సురేష్, కో డైరెక్టర్ :అను కె రెడ్డి, ఎగ్జిక్యుటివ్ నిర్మాత: గునకల మల్లికార్జున, నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం; సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ, కధ - మాటలు -స్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి.

    English summary
    Nikhil tweeted... Karthikeya 1st copy is Ready and being sent for Censor. It's too late for an August 1st release.. Will announce release date In 3 to 4 days. Karthikeya Team hav been working 24/7 to deliver the movie as soon as possible. Special mention 2 Music Dir Shekar Chandra and DOP Karthik.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X