ఎస్ఎస్ కార్తికేయ వెడ్డింగ్: రాజమౌళితో కలిసి ప్రభాస్ డాన్స్ (వీడియో వైరల్)
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి వేడుక జైపూర్ సమీపంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో గ్రాండ్‌గా మొదలైంది. టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, అనుష్క, నాగార్జున, రానా తదితరులు ఇప్పటికే జైపూర్ చేరుకున్నారు. డిసెంబర్ 29న మెహందీ, సంగీత్, డిసెంబర్ 30న పెళ్లి వేడుక జరుగనుంది.
ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగే ఫైవ్ స్టార్ హోటల్ వద్దకు చేరుకోగానే ప్రభాస్ డాన్స్ చేశారు. ప్రభాస్‌తో కలిసి రాజమౌళి కూడా స్టెప్పులేయడం విశేషం.
వైరల్ అవుతున్న ప్రభాస్ డాన్స్ వీడియో
జైపూర్ సమీపంలో కుకాస్ అనే ప్రాంతంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్‌లో కార్తికేయ పెళ్లి వేడుక జరుగుతోంది. ఇక్కడికి రాగానే ప్రభాస్ డాన్స్ చేశారు.
స్టెప్పులేసిన రాజమౌళి
ప్రభాస్‌తో కలిసి రాజమౌళి కూడా స్టెప్పులేశారు. పక్కనే అనుష్క కూడా ఉండటం గమనార్హం. ప్రభాస్ రాకతో పెళ్లి వేడుక ప్రాంగణం మరింత సందడిగా మారింది.

హీరోయిన్ అనుష్క
తనకు అత్యంత సన్నిహితుడైన రాజమౌళి కుమారుడి పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు అనుష్క రెండు రోజుల ముందే హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగే పెళ్లి వేడుకలో అనుష్క చేయబోయే సందడి ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్
రాజమౌళి ఇంట్లో ఏ వేడుక జరిగినా అది ప్రభాస్ లేకుండా ఉండదు. మరి కార్తికేయ వివాహం అంటే యంగ్ రెబల్ స్టార్ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


Click it and Unblock the Notifications











