ఆర్ఎక్స్ 100తో పోల్చుతున్నారు.. ట్రైలర్ చూడగానే అర్థం అయిపోయింది.. కార్తికేయ!

Recommended Video

Karthikeya Says Natakam Movie Became Bigger Hit Than RX 100

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాలు రాజ్యం ఏలుతున్నాయి. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 వంటి చిత్రాలు ఏస్థాయిలో ఘనవిజయం సాధించాయో అందరికి తెలిసిందే. ఆ తరహాలోనే వస్తున్న మరో చిత్రం నాటకం. ఆశిష్, ఆష్మి ఈ చిత్రంలో జంటగా నటించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు అతిధిగా హాజరైన ఆర్ఎక్స్ 10ఓ హీరో కార్తికేయ ఆకట్టుకునే ప్రసంగం చేసాడు.

 కార్తికేయ చేతుల మీదుగా

కార్తికేయ చేతుల మీదుగా

హీరో కార్తికేయ చేతుల మీదుగా రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్స్ లోగో లాంచ్ జరిగింది. తన చేతుల మీడియా లోగో లాంచ్ అవుతుందని ముందుగా తెలియదని కార్తికేయ అన్నాడు. లోగో లాంచ్ చేయడం సంతోషంగా ఉందని తెలిపాడు.

 ఆర్ఎక్స్ 100తో పోలిక

ఆర్ఎక్స్ 100తో పోలిక

కార్తికేయ నాటకం చిత్రం గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రం గురించి యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆర్ఎక్స్ 100తో పోలిక పెడుతూ కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఆ విషయాన్ని నేను గొప్పగా ఫీల్ అవడం లేదని కార్తికేయ తెలిపాడు. ఇదేమి నెగిటివ్ గా తీసుకోవాల్సిన అంశం కూడా కాదని తెలిపాడు.

 అంతకు మించి విజయం

అంతకు మించి విజయం

నాటకం చిత్ర ట్రైలర్ చూసిన వెంటనే హిట్ అవుతుందని అర్థం అయిపోయింది. ఆర్ఎక్స్ 100ని మించి విజయం సాధించాలని కార్తికేయ ఆకాంక్షించాడు. ఆర్ఎక్స్ 100 చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన శివమ్ సెల్యులాయిడ్ వాళ్ళే ఈ చిత్రాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని తెలిపాడు.

చాలా బాగా నటించారు

చాలా బాగా నటించారు

ఆశిష్ గాంధీ, ఆష్మి ఈ చిత్రంలో జంటగా నటించారు. కళ్యాణ్ గొంగన ఈ చిత్రానికి దర్శకుడు. ఆశిష్ నటన ఇంతకు ముందే చూశానని, ఈ చిత్రంలో చాలా అద్భుతంగా నటించాడని కార్తికేయ ప్రశంసించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X