»   » మోసగాడు, వంచకుడు: భర్త ఆత్మహత్యపై నటి నందిని సంచలనం!

మోసగాడు, వంచకుడు: భర్త ఆత్మహత్యపై నటి నందిని సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ టీవీ నటి నందిని ఆత్మహత్యకు పాల్పడ్డ తన భర్త కార్తికేయన్ మీద సంచలన ఆరోపణలు చేసారు. అతడి ఆత్మహత్యకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడో పెద్ద మోసగాడు అంటూ నందిని మీడియాకు తెలిపారు.

నందిని భర్త కార్తీకేయన్ సోమవారం రాత్రి చెన్నైలోని విరుంబాకంలోని ఓ లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. కూల్ డ్రింకులో విషం కలుపుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు.

ఎంతో మందిని మోసం చేసాడు

ఎంతో మందిని మోసం చేసాడు

తన భర్త కార్తికేయన్ పెద్ద మోసగాడని, ఎంతో మంది అతడి వల్ల మోసపోయారని.... చాలా మంది వద్ద డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడని, వారంతా వచ్చి పలు సందర్భాల్లో తనను ఇబ్బందులు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయని నందిని తెలిపారు.

వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధం

కార్తికేయన్ గతంలో ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగించాడని, అతడి వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, ఆ కేసులో కార్తికేయన్ ను అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని నందిని గుర్తు చేసారు.

అప్పటి నుండి అతడికి దూరంగానే ఉంటున్నా

అప్పటి నుండి అతడికి దూరంగానే ఉంటున్నా

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఎంతో మంది వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసాడు. వారంతా తన వద్దకు వచ్చి గొడవ చేసేవారు, ఇదే విషయమై నేను నిలదీస్తే ఆత్మహత్య చేసుకుంటానని గతంలో బెదిరించాడని, అప్పటి నుండి అతడికి దూరంగానే ఉంటున్నట్లు నందిని తెలిపారు.

అందుకే ఈ విషయాలు బయటపెడుతున్నా

అందుకే ఈ విషయాలు బయటపెడుతున్నా

నన్ను పేమించినట్లు నటించి, నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.... తర్వాత అతడి వంచన నాకు అర్థమైంది. నా డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడన్న విషయం కొన్ని రోజుల్లోనే నాకు తెలిసిపోయింది. ఇంతకాలం ఈ విషయాలన్నీ నా మనసులోనే దాచుకున్నా. అతడి ఆత్మహత్యకు నాకు లింకు పెడుతున్నారు కాబట్టి ఈ విషయం బయట పెడుతున్నాను అని నందిని తెలిపారు.

తమిళంలో నందిని పాపులారిటీ

తమిళంలో నందిని పాపులారిటీ

తమిళనాడులో బుల్లితెరపై నందినికి మంచి పాపులారిటీ ఉంది. శరవణన్ మీనాక్షీ సీరియల్ ద్వారా ఆమె టీవీ స్టార్ గా మారిపోయారు. సీరియళ్లతో పాటు వంశం, కేడి బిల్లా, కిలాడీ రంగా చిత్రాల్లోనూ నందిని నటించింది.

వివాహం

వివాహం

2016 జూన్ 5వ తేదీన కార్తీక్‌తో నందిని వివాహం జరిగింది. తొలుత నందినిని వివాహం చేసుకొనేందుకు వచ్చిన కార్తీక్‌ను నందిని రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆయనతో ప్రేమలో పడింది.

English summary
Nandhini has alleged that her husband took money from many people on the pretext of getting them government jobs. She came to know about her husband’s shady dealings when people who were duped by him started creating problems for her, asking for their money.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu