Sulthan movie ప్రీ రిలీజ్ రివ్యూ.. కార్తీ, రష్మిక ఫెర్ఫార్మెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్!

తమిళంలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్ర‌భు, ఎస్ఆర్ ప్ర‌కాశ్ నిర్మించిన చిత్రం సుల్తాన్ మూవీ. బక్కిరాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కార్తీ, రష్మిక మందన్న జంటగా నటించారు. లాక్‌డౌన్ తర్వాత తమిళంలో రిలీజ్ అవుతున్న తొలి భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ సినిమాలో కీలక అంశాలు మీ కోసం..

కౌరవుల వైపు కృష్టుడు ఉంటే

కౌరవుల వైపు కృష్టుడు ఉంటే

సుల్తాన్ కథ విషయానికి వస్తే.. మ‌హాభార‌తంలో కృష్ణుడు పాండ‌వుల‌వైపు కాకుండా కౌర‌వుల‌ వైపు ఉంటే ఎలా ఉంటుంది అనే విభిన్నమైన పాయింట్‌ని తీసుకుని దర్శకుడు బక్కియరాజ్ కన్నన్ సుల్తాన్ సినిమాను రూపొందించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హై యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెబుతున్నారు.

 100 మంది అన్నయ్యలకు సోదరుడిగా

100 మంది అన్నయ్యలకు సోదరుడిగా

సుల్తాన్ సినిమాలో 100 మంది అన్నయ్యలకు కార్తీ సోదరుడుగా నటిస్తున్నారు. కథను స్ట్రాంగ్, ఎమోషనల్‌గా మలచడానికి దాదాపు రెండేళ్లు ఈ సినిమా స్క్రిప్టుపై కసరత్తు చేశారు. సుల్తాన్ చిత్రంలో సరికొత్త కార్తీని చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వంద తలల కార్తీని ఈ సినిమాలో చూడవచ్చనే విషయాన్ని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రష్మిక తొలిసారి కోలీవుడ్‌లోకి

రష్మిక తొలిసారి కోలీవుడ్‌లోకి

దక్షిణాదిలో అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక మందన్న తొలిసారి తమిళంలో నటిస్తున్నారు. సుల్తాన్ సినిమాతో కోలీవుడ్‌లోకి రష్మిక అడుగు పెట్టారు. ఈ సినిమాలో అల్లరి పిల్లగా మరోసారి బబ్లీ రోల్‌లో ఆమె కనిపించనున్నారు. ఈ చిత్రం ద్వారా రష్మిక కోలీవుడ్‌లో పాగా వేస్తుందా అనే వేచి చూడాల్సిందే.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై

డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ పతాకంపై ప్ర‌భు, ప్ర‌కాశ్ సుల్తాన్ మూవీని నిర్మించారు. సాధారణంగా డ్రీమ్ వారియర్స్ ఎంచుకొనే కథలు ప్రేక్షకులను అలా కట్టిపడేస్తాయనే టాక్ దక్షిణాది ఇండస్ట్రీలో ఉంది. సుల్తాన్ మూవీ ఎలా ఉంటుందో కొన్ని గంటలు వేచి చూస్తే స్పష్టమవుతుంది.

నాగార్జునతో కార్తీ బాక్సాఫీస్ పోటీ

నాగార్జునతో కార్తీ బాక్సాఫీస్ పోటీ

ఏప్రిల్ మొదటి వారమే టాలీవుడ్‌లో ఇద్దరు అగ్రహీరోలు నాగార్జున, కార్తీ బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నారు. ఊపిరి చిత్రంలో వారిద్దరూ కలిసి నటించారు. వైల్డ్ డాగ్ సినిమాతో పోటీ పడుతున్న కార్తీకి నా తమ్ముడు సక్సెస్ సాధించాలని నాగార్జున్ కోరుకొన్నారు. అలాగే కార్తీ కూడా నాగార్జునకు విషెస్ అందజేస్తూ అన్నయ్య నాగ్ నటించిన వైల్డ్ డాగ్ సినిమాను చూసిన తర్వాతే సుల్తాన్ సినిమాను చూడండి అని అన్నారు.

తెర వెనుక, తెర ముందు

తెర వెనుక, తెర ముందు

నటీనటులు: కార్తీ, రష్మిక మందన్న, నెపోలియన్, యోగిబాబు, నవాబ్ షా, శరత్ కుమార్ తదితరులు
కథ, దర్శకత్వం: బక్కియరాజ్ కన్నన్
నిర్మాత: ఎస్ఆర్ ప్రకాశ్ ప్రభు
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా (బీజీఎం), వివేక్, మెర్విన్ (పాటలు)
సినిమాటోగ్రఫి: సత్యన్ సూర్యన్
ఎడిటింగ్: రుబెన్
బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2021-04-02

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X