twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాబోయే శ్రీమతిని పరిచయం చేసిన కార్తీకేయ.. వేదికపైనే ప్రపోజ్.. రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్‌గా

    |

    RX 100 ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించన్నారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బిగ్ టికెట్‌ను హీరోలు సుధీర్ బాబు, శ్రీవిష్ణు, విశ్వక్ సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ ..

    దిల్ రాజుకు సుధీర్, శ్రీవిష్ణుకు..

    దిల్ రాజుకు సుధీర్, శ్రీవిష్ణుకు..

    రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు పిలిచిన వెంట‌నే వ‌చ్చిన దిల్ రాజు, సుధీర్ బాబు, శ్రీవిష్ణు అన్నయ్య, విశ్వక్ సేన్, కిరణ్.... ప్రతి ఒక్కరికీ థాంక్యూ. 'రాజా విక్రమార్క' చిరంజీవిగారి టైటిల్. ఆయన టైటిల్ పెట్టుకునేంత స్థాయి ఉందని అనుకోవడం లేదు. కానీ, చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమా ఏది చూసినా... అందులో మనల్ని మనం ఊహించుకుంటూ పెరిగాం. 'గ్యాంగ్ లీడర్' చూసినప్పుడు నేనే గ్యాంగ్ లీడర్ అనుకున్నా. 'ఇంద్ర', 'ఠాగూర్'... ప్రతి సినిమా చూసినప్పుడు ఫ్యాన్స్‌గా అలాగే ఫీలయ్యాం. ఆ అభిమానికి మించిన అర్హత లేదని ఫీలయ్యి... ధైర్యం చేసి టైటిల్ పెట్టేసుకున్నాను. నా సినిమాలు అన్నిటిలో నేను సొంతంగా టైటిల్ పెట్టుకున్నది ఈ సినిమాకే. ఇప్పటివరకూ ఎప్పుడూ ఇలా చేయలేదు అని కార్తీకేయ అన్నారు.

     చిరంజీవి టైటిల్ పెడితే..

    చిరంజీవి టైటిల్ పెడితే..

    రాజా విక్రమార్క టైటిల్ పెట్టక ముందు దర్శకుడు ముందు వేరే టైటిల్ అనుకుంటే బాగానే ఉందనుకున్నాం. ఫోనులో రాజా విక్రమార్క పేరు కనిపిస్తే.. ఈ టైటిల్ పెడితే బావుంటుందని నాకు అనిపించింది. మా దర్శకుడికి ఇటువంటివన్నీ నచ్చవు. నేను అడిగే సరికి ఒక రోజు టైమ్ తీసుకుని సెట్ అవుతుందని చెప్పాడు. దాంతో నేను చాలా హ్యాపీ. చిరంజీవి గారి టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమా నాకు చాలా స్పెషల్. సినిమాకు వస్తే... 'ఆర్ఎక్స్ 100' విడుదలైన తర్వాత కథలు వింటున్న సమయంలో ఒక ఫ్రెండ్ ద్వారా శ్రీ సరిపల్లి కథ చెప్పాడానికి వచ్చాడు. విన్నాను. కథ నచ్చింది. 'ఆర్ఎక్స్ 100' తర్వాత కొన్ని సినిమాలు చేశా. అయితే, ఈ సినిమా నా సినిమా అన్నట్టు మనసులో ఒక కనెక్షన్ ఏర్పడింది. శ్రీ ఏ పని చేసినా నిజాయతీగా, శ్రద్ధగా చేస్తాడని ఫస్ట్ మీటింగ్ లో అనిపించింది. ఆ నమ్మకం ఈ సినిమా మీద కన్వర్ట్ అయ్యింది అని కార్తీకేయ చెప్పారు.

     రాజా విక్రమార్క నాకు కాన్ఫిడెన్స్ ఇస్తుందంటూ..

    రాజా విక్రమార్క నాకు కాన్ఫిడెన్స్ ఇస్తుందంటూ..

    'ఆర్ఎక్స్ 100' తర్వాత రెండు మూడు సినిమాలు అటు ఇటు అయితే నా స్క్రిప్ట్ సెలక్షన్ ఏదోలా ఉంటుందన్నట్టు జనాలు ఫేస్ పెట్టేవాళ్లు. 'నేను హిట్టు కొడుతున్నా చూడు' అని లోపల వాళ్లకు కమ్యూనికేట్ చేయాలని అనిపించేది. మాస్ ఇమేజ్ కోసమనో, భారీగా విడుదల చేయవచ్చనో కొన్ని సినిమాలు చేస్తాం. ఈ సినిమా మాత్రం కథ విని, ఎగ్జైట్ అయ్యి శ్రీతో ట్రావెల్ అవ్వాలని చేశా. మనసులో అనిపించింది చేశా. చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలని మనసులో ఎందుకు అనిపించిందో తెలియదు. అనిపించింది. అలాగే, ఈ సినిమాకు అనిపించింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడం నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నాకు నా మీద నమ్మకాన్ని ఇస్తుంది. అంత ఇంపార్టెంట్ మూవీ ఇది అని కార్తీకేయ ఎమోషనల్ అయ్యారు.

    ఆదిరెడ్డి, 88 రామారెడ్డి గురించి

    ఆదిరెడ్డి, 88 రామారెడ్డి గురించి


    రాజా విక్రమార్క సినిమాను మేమే నిర్మిద్దామని అనుకున్నాం. అప్పుడు 90ml స్టార్ట్ చేశాం. అదే సమయంలో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత వినోద్ రెడ్డి.. ఆదిరెడ్డి, '88' రామారెడ్డిగారిని పరిచయం చేశారు. వాళ్లు మేం చేస్తామన్నారు. 2019లో సినిమా మొదలైంది. మధ్యలో నేను 'చావు కబురు చల్లగా' చేశా. తర్వాత కరోనా వచ్చింది. ఈ సమయంలో శ్రీ, సారిపల్లి అతని టీమ్ చాలా పాజిటివిటీతో ఉన్నారు. నాకు శ్రీ సారిపల్లితో మళ్లీ సినిమా చేయాలనుంది. మళ్లీ చేయాలంటే సినిమా సక్సెస్ అవ్వాలి. మనం మంచి మనసుతో బలంగా కోరుకుంటే జరుగుతుంది. ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. '88' రామారెడ్డి, ఆదిరెడ్డిగారికి థాంక్స్. వాళ్లకు నిర్మాణం కొత్త అయినా... నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కష్టపడి బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాను. వాళ్లకు హిట్ ఇచ్చి సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటాను అని కార్తీకేయ అన్నారు

    ఆ రేంజ్ హిట్ రాలేదంటూ కార్తీకేయ

    ఆ రేంజ్ హిట్ రాలేదంటూ కార్తీకేయ


    రాజా విక్రమార్క షూటింగ్ సమయంలో సాయికుమార్ గారు, సుధాకర్ కోమాకుల, తాన్యా రవిచంద్రన్, హర్షవర్ధన్ గారు ... అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అద్భుతంగా నటించారు. నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య ఈ సినిమాలో నటించాడు. బెస్ట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఈ సినిమాకు కుదిరింది. నాకు 'గ్యాంగ్ లీడర్', 'చావు కబురు చల్లగా' సినిమాలకు మంచి పేరొచ్చింది. కానీ, 'ఆర్ఎక్స్ 100' రేంజ్ కమర్షియల్ హిట్ రాలేదు. అయినా 'ఈ సినిమా హిట్టవుతుంది. బావుంటుంది' అని నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న, నన్ను నమ్ముతున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి 100 శాతం కష్టపడతా. 'రాజా విక్రమార్క'తో మొదలుపెట్టి నేను ఎంపిక చేసుకునే ప్రతి కథ, నేను చేసే ప్రతి సినిమా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తా. మీరు గర్వపడేలా చేస్తా. ప్రామిస్ చేస్తా అని కార్తీకేయ అన్నారు.

    Recommended Video

    90ml Director Shekar Reddy Exclusive Interview
    కాబోయే శ్రీమతికి ప్రపోజ్ చేసిన కార్తీకేయ

    కాబోయే శ్రీమతికి ప్రపోజ్ చేసిన కార్తీకేయ

    'రాజా విక్రమార్క' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనకు కాబోయే భార్యను కార్తికేయ పరిచయం చేశారు. తన ప్రేమకథ గురించి కార్తికేయ మాట్లాడుతూ "నేనే ప్రపోజ్ చేశా. తన మెసేజ్ కోసం ఎదురుచూశా. గిఫ్టులు ఇచ్చాను. నా లైఫ్ లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ పెట్టాను. ఫోనులో ప్రపోజ్ చేశా. ఆ రోజే 'నేను హీరో అవుదామనుకుంటున్నాను. హీరో అయ్యాక మీ ఇంటికి వచ్చి అడుగుతా' అని చెప్పా. ఫైనల్‌గా... ఆ అమ్మాయిని నవంబర్ 21న పెళ్లి చేసుకోబోతున్నాను. తన పేరు లోహిత. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్. ఎక్స్ గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్.. వైఫ్" అని చెప్పారు. అనంతరం వేదికపై లోహితకు కార్తికేయ ప్రపోజ్ చేశారు.

    English summary
    Hero Karthikeya Gummakonda's Raja Vikramarka is coming on November 12th. In this occassion pre release event held in hyderabad. Kartikeya Gummakonda introduced fiance Lohita at Raja Vikramarka pre release event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X