Raja Vikramarka Twitter Review: సినిమాకు షాకింగ్ టాక్.. అదొక్కటి తప్ప అంతా.. మొత్తంగా ఎలా ఉందంటే!
అదిరిపోయే కంటెంట్‌తో వచ్చిన 'RX100' అనే సినిమాతో హీరోగా పరిచయమై.. మొదటి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులను అలరించాడు టాలెంటెడ్ గాయ్ కార్తికేయ గుమ్మకొండ. ఆ తర్వాత కూడా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపుతూ సత్తా చాటుతున్నాడు. అయితే, భారీ విజయాన్ని మాత్రం ఇప్పటికీ సొంతం చేసుకోలేకపోతున్నాడు. ఇలాంటి సమయంలో 'రాజా విక్రమార్క' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు పడిపోయాయి. అక్కడి రిపోర్టులు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. ఇక, ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ మీకోసం!

‘రాజా విక్రమార్క’గా వచ్చిన కార్తికేయ
హిట్ కోసం వేచి చూస్తోన్న యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ - తన్య రవిచంద్రన్ జంటగా నటించిన చిత్రం 'రాజా విక్రమార్క్'. శ్రీ సరిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆదిరెడ్డి సమర్పణలో 88 రమా రెడ్డి నిర్మించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ మూవీ తాజాగా విడుదల అయింది.

అంచనాలు భారీగా.. మరింత పెంచేస్తూ
ఫన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన 'రాజా విక్రమార్క' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీనికితోడు మెగాస్టార్ లాంటి పెద్దవాళ్లు ఈ సినిమాకు ప్రమోషన్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

బిజినెస్ కూడా భారీగా.. మొత్తం ఎంత?
కార్తికేయకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ 'రాజా విక్రమార్క' మూవీపై అంచనాలు ఉండడంతో హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 4 కోట్ల వ్యాపారం జరుపుకుంది. దీంతో ఈ మూవీ గ్రాండ్‌గా విడుదల అవుతోంది. అన్ని ఏరియాల్లో కలుపుకుని ఈ సినిమా 600లకు పైగా థియేటర్లలో విడుదల కాబోతుండడం విశేషం.

‘రాజా విక్రమార్క’కు ఊహించని టాక్
కార్తికేయ నటించిన 'రాజా విక్రమార్క' మూవీ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొంత మంది ఈ చిత్రం బాగుందని కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం అస్సలు బాలేదని అంటున్నారు. దీంతో ఈ చిత్రానికి ఆదిలోనే వింత అనుభవం ఎదురైంది.

మూవీలో ప్లస్ మైనస్ పాయింట్స్ ఇవే
'రాజా విక్రమార్క' మూవీని వీక్షించిన వారి అభిప్రాయం ప్రకారం.. ఈ సినిమాలో కార్తికేయ గుమ్మకొండ నటన.. కామెడీ సీన్స్ మాత్రమే బాగున్నాయట. అలాగే, మ్యూజిక్ కూడా పర్వాలేదనిపిస్తుందని తెలిసింది. కానీ, థ్రిల్ మిస్ అయిన ట్విస్టులు, స్లో నేరేషన్, ఎడిటింగ్, దర్శకత్వ లోపం, లాజిక్ లేని సీన్స్ ఈ చిత్రానికి మైనస్ అని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా సెకెండాఫ్ అలా ఉందట
'రాజా విక్రమార్క' ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌లా చూపించడానికి చేసే ప్రయత్నాలు, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, కొన్ని కామెడీ సన్నివేశాలతో పర్వాలేదనేలా సాగుతుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం అంతగా అనుకున్న రేంజ్‌లో పండలేదని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ముందే తెలిసేలా ఉన్న సీన్స్ ప్రేక్షకులకు పరీక్షను పెడతాయట.
Recommended Video

మొత్తంగా ‘రాజా విక్రమార్క’ రిపోర్ట్
చాలా రోజులుగా భారీ విజయం కోసం వేచి చూస్తోన్న కార్తికేయ నటించిన తాజా చిత్రం 'రాజా విక్రమార్క'. భారీ అంచనాలతో వచ్చిన ఇది ప్రేక్షకులను అలరించేలా లేదని ఇప్పటి వరకూ సినిమాను చూసిన వాళ్లంతా అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఒక్క కార్తికేయ నటన తప్ప అంతా మైనస్సే అని అంటున్నారు. మరి రాను రానూ ఈ సినిమా టాక్ మారుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











