Bedurulanka Twitter Review: బెదురులంక టాక్ వచ్చేసింది.. ఆ ముగ్గురు షాకింగ్‌గా.. కార్తికేయ కొట్టాడా?

బోల్డు కంటెంట్‌తో వచ్చిన 'RX100' అనే సినిమాతో హీరోగా పరిచయమై.. మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను అలరించాడు టాలెంటెడ్ గాయ్ కార్తికేయ గుమ్మకొండ. ఆ తర్వాత కూడా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మెప్పించాడు. ఇలా సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపుతూ సత్తా చాటుతున్నాడు. అయితే, భారీ విజయాన్ని మాత్రం ఇప్పటికీ సొంతం చేసుకోలేకపోతున్నాడు. ఇక, కార్తికేయ ఇప్పుడు 'బెదురులంక 2012' అనే సినిమా చేశాడు. ఇది శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ మూవీకి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో చూడండి!

బెదురులంక అని వచ్చాడు:టాలెంటెడ్ గాయ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన తాజా చిత్రమే 'బెదురులంక 2012'. క్లాక్స్ తెరకెక్కించిన ఈ సినిమాను లౌక్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ముప్పనేని రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

 Kartikeya Gummakonda Starrer Bedurulanka 2012 Movie Twitter Review

అలాంటి కథ.. ఫన్, ఫియర్:సరదా సరదాగా సాగిపోతున్న ఓ గ్రామంలో 2012వ సంవత్సరంలో ఏం జరిగింది? అప్పటి వరకూ ఫన్నీగా సాగిపోతోన్న హీరో లైఫ్‌లో ఎలాంటి ట్రాజెడీ ఎదురైంది? అనే అంశాలతో 'బెదురులంక 2012' మూవీ తెరకెక్కింది. ఇందులో మేజర్‌గా ఫన్ ఎలిమెంట్స్‌ను హైలైట్ చేశారు. అదే సమయంలో కథలో భయాన్ని కూడా జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు.

రీసెంట్ టైంలో గ్రేట్ ఫన్:కార్తికేయ గుమ్మకొండ నటించిన 'బెదురులంక 2012' మూవీని చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇందులో ఆయన 'మంచి కామెడీ, ట్రాజెడీతో కూడిన మిశ్రమమే బెదురులంక. ఈ మధ్య కాలంలో మంచి ఫన్ ఇచ్చిన చిత్రం. సెకెండాఫ్‌లో అజయ్ ఘోష్, శ్రీకాంత్, కసి రెడ్డి ప్రాణం పోశారు. కార్తికేయ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. నేహా శెట్టి అద్భుతం' అని చెప్పారు.

ఆ ముగ్గురు రఫ్పాడారు:'బెదురులంక 2012' మూవీని చూసిన మరో నెటిజన్ ఇలా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, కసి రెడ్డి.. ఈ మూడు పేర్లను గుర్తుంచుకోండి. రప్పాండించారు. కుర్రాళ్లకు సూపర్‌గా ఎంజాయ్ చేసే స్టఫ్ ఈ సినిమాలో ఉంది' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

థియేటర్లలో చూడదగ్గదే:'బెదురులంక 2012' సినిమాను వీక్షించిన ఇంకో నెటిజన్ 'బెదురులంక 2012: చక్కగా రాసిన సంభాషణలతో కూడిన హాస్యం, కథల కలయికతో ఆకట్టుకుంది. విజువల్స్, సంగీతం ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని ఇస్తాయి. నటీనటులందరి మంచిగా నటించారు. ఓవరాల్‌గా చూస్తే థియేటర్లలో చూడదగ్గ సినిమా ఇది' అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

నన్ను ఆశ్చర్యపరిచాయి:కార్తికేయ నటించిన 'బెదురులంక 2012' మూవీని చూసిన ఇంకొక నెటిజన్ 'బెదురులంక 2012: పిచ్చిగా సరదా అనిపించింది. సెకండాఫ్ నాకు తెగ నవ్వు తెప్పించింది. బెదురులంక లోకంలో మునిగి తేలే ప్రతి క్షణాన్ని చివరిదాకా ఆస్వాదించాను. పాత్రలు, సెటప్, నిమిషాల వివరాలు కూడా నన్ను ఆశ్చర్యపరిచాయి' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు.

ఒక క్లీన్ ఎంటర్‌టైనర్:'బెదురులంక 2012' చూసిన తర్వాత మరో నెటిజన్ ఇలా స్పందించారు. 'బెదురులంక 2012 ఒక క్లీన్ ఎంటర్‌టైనర్. సినిమా సెకండాఫ్ చాలా అవసరమైన వినోదాన్ని అందిస్తుంది. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్ రాజ్ కుమార్ కాసి రెడ్డి నుండి చాలా మంచి ప్రదర్శనలు చేశారు. కార్తికేయ, నేహా శెట్టి తమ గత చిత్రాలకు విరుద్ధంగా నటించి మెప్పించారు' అని చెప్పారు.

మీ టికెట్ వృథా కాదు:'బెదురులంక' మూవీని చూసిన ఇంకొక నెటిజన్ 'డీసెంట్ గోదావరి రూరల్ ఫన్ ఎంటర్‌టైనర్. అజయ్ ఘోష్, సత్య, కసి రాజు, శ్రీకాంత్ అయ్యంగార్ బాగా నవ్వించారు. చివరి 45 నిమిషాలు వినోదం సూపర్‌గా ఉంది. మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్న టికెట్ వృథా కాదు. కార్తికేయ గుమ్మకొండ, లౌక్యా ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు అభినందనలు' అంటూ రాసుకొచ్చాడు.

 Kartikeya Gummakonda Starrer Bedurulanka 2012 Movie Twitter Review

ఓవరాల్‌గా అలాంటి టాక్:ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లను బట్టి కార్తికేయ గుమ్మకొండ నటించిన 'బెదురులంక 2012' మూవీకి పాజిటివ్ టాక్ కనిపించింది. ముఖ్యంగా ఇందులో సెకెండాఫ్‌లో వచ్చే ఫన్ అదిరిపోయిందని అంటున్నారు. హీరో, హీరోయిన్ల కంటే ముగ్గురు ఆర్టిస్టుల యాక్టింగ్ గురించే మాట్లాడుతున్నారు. ఇదే టాక్ కంటిన్యూ అయితే కార్తికేయ కమ్‌బ్యాక్ అయినట్లే అని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X