స్టార్ హీరో కుమార్తెతో కార్తీకేయ గుమ్మకొండ.. NIA అధికారిగా పవర్‌ఫుల్ రోల్‌లో..
RX 100 మూవీ తర్వాత విభిన్నమైన కథలు, పాత్రలతో ఆలరిస్తున్న యువ హీరో కార్తికేయ గుమ్మకొండ మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. 88 రామారెడ్డి నిర్మాతగా, దర్శకుడు శ్రీ సరిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ చిత్రంలో హ్యాపీ డేస్ ఫేమ్ సుధాకర్ కోమాకుల ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.
ఇంకా పేరు పెట్టని సినిమా గురించి దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ కార్తీకేయతో రూపొందిస్తున్న ఈ చిత్రం పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇందులో కార్తికేయ NIA ఆఫీసర్‌గా నటిస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి సరసన కరుప్పన్‌లో నటించిన తాన్యా రవిచంద్రన్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాం. ఆమె సీనియర్ తమిళ నటుడు రవిచంద్రన్ గారి మనవరాలు. మంచి క్లాసికల్ డాన్సర్. మెంటల్ మధిలో, దొరసాని, అంతరిక్షం చిత్రాలకు స్వరాలందించిన ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం'' అని చెప్పారు.

నిర్మాత 88 రామారెడ్డి మాట్లాడుతూ.. వినాయక్ శిష్యుడైన శ్రీ సరిపల్లిని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. కార్తికేయ పాత్ర చిత్రీకరణ చాలా బాగుంటుంది. ఇప్పటికీ సగం సినిమా పూర్తైయింది. ఈ నెలాఖరు వరకు హైదరాబాదులో జరిపే షెడ్యూల్ తో 90 శాతం పూర్తవుతుంది. మిగిలిన 10 శాతాన్ని మారేడుమిల్లిలో చిత్రీకరిస్తాం అని తెలిపారు.
బికినీ, పొట్టి దుస్తుల్లో కాకుండా ఈసారి డిఫరెంట్‌గా పాయల్ రాజ్‌పుత్
నటీనటులు: కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు
దర్శకత్వం: శ్రీ సరిపల్లి
సమర్పణ : ఆదిరెడ్డి. టి
నిర్మాత: 88 రామారెడ్డి
సినిమాటోగ్రఫి: పిసి మౌళి
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
ఎడిటింగ్: జస్విన్ ప్రభు
ఆర్ట్: నరేష్ తిమ్మిరి, శ్రీ రూప్ మీనన్
ఫైట్స్: సుబ్బు, నబా
పాటలు: రామజోగయ్య శాస్త్రి
విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు


Click it and Unblock the Notifications











