అప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు అల్లుడు.. మెగాస్టార్ వస్తుంటే టెన్షన్‌గా ఉంది!
సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం తేజ్ ఐ లవ్ యూ. అనుపమ పరమేశ్వరన్, సాయిధరమ్ తేజ్ జంటగా నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ తెరకెక్కిస్తున్నారు. చిత్రంపై మరింత ఆసక్తిని పెంచే విధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజగా ఈ చిత్రంలోని సెకండ్ సాంగ్ 'నచ్చుతుందే' విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో కరుణాకరన్, సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, నిర్మాత కె ఎస్ రామారావుతో పాటు ఇతర చిత్ర యూనిట్ కూడా పాల్గొన్నారు.

నేను పాడినట్లే ఉంది
ఈ చిత్రంలోని నచ్చుతుందే సాంగ్ ని సింగర్ హరిచరణ్ పాడారని తేజు తెలిపాడు. ఆయన పడుతుంటే నేను పడినట్లే ఉందని చాలా మంది తెలిపారని తేజు అన్నాడు. ఈ చిత్రంలోని అన్ని పాటలు అలరిస్తాయని తేజు తెలిపాడు.

అప్పుడు పవన్ కళ్యాణ్
తనకు తొలిసారి పవన్ కళ్యాణ్ సినిమా అవకాశం ఇచ్చారని దర్శకుడు కరుణాకరన్ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన అల్లుడితో చేస్తున్నానని తెలిపాడు. కరుణాకరన్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఆల్ టైం క్లాసిక్ తొలిప్రేమ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

మెగాస్టార్ వస్తున్నారు
నేడు ఆడియో వేడుక జరగబోతోంది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. మన మెగాస్టార్ వస్తుండడంతో తాను చాలా టెన్షన్ గా ఉన్నానని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది.

కెఎస్ రామారావు నిర్మాత
చిరంజీవితో అభిలాష, ఛాలెంజ్ వంటి అద్భుత చిత్రాలు నిర్మించిన కె ఎస్ రామారావు తేజ్ ఐ లవ్ యూ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











