పవన్ మేనియా: నితిన్-కరుణాకరన్ మూవీ డేట్ ఫిక్స్!
హైదరాబాద్: యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్ గౌడ్ సమర్పకులు. నితిన్
సరసన సుభాష్ ఘయ్ కాంచీ సినిమాతో పరిచయం అయిన బాలీవుడ్ కథానాయిక మిస్తీ జోడి కడుతోంది.
జూన్ 2 న చిత్రీకరణ ప్రారంభమయ్యే ఈ సినిమా ఇండియాతో పాటూ అబ్రాడ్లోనూ భారీ వ్యయంతో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ నెల 21 న ఈ సినిమా పూజ కార్యక్రమాలను లాంచనంగా జరుపుతామని...శ్రేస్ట్ మూవీస్‌లో గతంలో వచ్చిన ఇష్క్, గుండెజారి
గల్ల౦తయ్యి౦దే లా౦టి విజయాల అన౦తర౦ తీస్తున్న ఈ మూడో సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని నిర్మాత నికితా రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి: ఆండ్రూ, ఆర్ట్ రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్ గౌడ్.

నితిన్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ మేనియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా, అతన్ని ఆదర్శంగా తీసుకుని సినిమారంగంలోకి వచ్చిన నితిన్....ఇటీవల 'ఇష్క్' , 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రాలతో వరుస విజయాల్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు వరుస ప్లాపులతో సతమతం అయిన నితిన్‌కు పవన్ కళ్యాణ్ ఇమేజ్ బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.
గుండెజారి గల్లంతయ్యిందే చిత్రం విజయం వెనక కథ, దర్శకుడి పనితనం, హీరో హీరోయిన్ల టాలెంట్ ఉన్నప్పటికీ.....చిత్రంలో పవన్ కళ్యాణ్ పాట రీమేక్ చేసి పవన్ మేనియాను సినిమాలోకి జొప్పించడం వల్లనే భారీ విజయం సాధించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ నేపథ్యంలో తన ఎదుగుదలకు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను సపోర్టుగా వాడుకుంటున్న నితిన్....'ప్రస్తుతం కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమా చేస్తున్నాడు. ఈచిత్రం తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ మార్కు పడేలా సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు నితిన్. ఇపుడు పవన్ కళ్యాణ్‌తో 'తొలి ప్రేమ' లాంటి చిత్రాలు తెరకెక్కించిన కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా చేస్తుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











