చెర్రీ హీరోయిన్‌ను కాపాడిన పవన్ డైరెక్టర్
హైదరాబాద్: రామ్ చరణ్ సరసన ‘ఎవడు'తో పాటు ఇటీవల శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ' చిత్రంలో నటించిన అమీ జాక్సన్ పెద్ద ప్రమాదం నుండి బయట పడింది. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లను ప్రమాదాల భారి నుండి హీరోలు కాపాడటం చూస్తూనే ఉంటాం. కానీ రియల్ లైఫ్‌లో ఆమెను కాపాడింది మాత్రం ఓ డైరెక్టర్. అతనెవరో కాదు... పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ' డైరెక్టర్ కరుణాకరన్.
ఉదయ్ స్టాలిన్ హీరోగా తెరకెక్కుతున్న ఓ తమిళ చిత్రంలో కరుణాకరన్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి తిరుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగు భాగంగా కొండ ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతోంది. అమీ జాక్సన్ బైక్ నడుపుతూ అదుపు తప్పి కొండ పై నుండి లోయలో పడి పోతుంటే.....కరుణాకరన్ రిస్క్ చేసి ఆమె ప్రాణాలు కాపాడాడు.

ఈ సంఘటన గురించి కరుణాకరన్ వివరిస్తూ...‘షూటింగులో భాగంగా నేను, ఉదయ్ ఒక బైకుపై వెలుతున్నాం... అమీ జాక్సన్ మరో టూ వీలర్ రైడ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె కంట్రోల్ తప్పింది. కొండ చివరి వరకు వెళ్లింది. వెంటనే నేను బైకు దిగి ఆమె పడిపోకుండా ఆపాను' అని చెప్పారు. ఈ సంఘటనపై అమీ జాక్సన్ తన ట్విట్టర్లో స్పందిస్తూ...తాను పడిపోకుండా కాపాడిన కరుణాకరన్ కు థాంక్స్ కూడా చెప్పింది.


Click it and Unblock the Notifications











