అప్పుడు తొలిప్రేమ కోసం వచ్చా.. ఇది రెండవ సారి.. కరుణాకరన్!
సాయిధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యూ చిత్రం జులై 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విజయవాడలో ఆడియో సక్సెస్ మీట్ నిర్వహించారు. చిత్ర దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ తాను విజయవాడకు రావడం ఇది రెండవ సారి అని తెలిపారు.
తొలిప్రేమ సక్సెస్ ఈవెంట్ కోసం తొలిసారి అప్పట్లో విజయవాడ వచ్చానని కరుణాకరన్ గుర్తు చేసుకున్నారు. తేజ్ ఐ లవ్ యూ చిత్రం అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నట్లు కరుణాకరన్ తెలిపాడు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఈ చిత్రం కరుణాకరన్ స్టైల్ లో ఉంటుందని తెలిపాడు.

సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశామని తేజు తెలిపాడు. అనుపమతో నటించడం మరచిపోలేని అనుభూతి ఎన్ని తేజు తెలిపాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తేజ్ ఐ లవ్ యూ చిత్రం తెరకెక్కింది.


Click it and Unblock the Notifications











