మెగా మేకర్ గా పేరుపొందిన ఎమ్.ఎస్.రాజు తన తర్వాత సినిమాని,తన కొడుకు అశ్విన్ ని తొలిప్రేమ దర్సకుడు కరుణాకరణ్ చేతిలో పెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే అతను చెప్పిన కథ బాగా నచ్చిందని,కొన్ని కరెక్షన్స్ చేయమన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇంతకు ముందు తేజ దర్శకత్వంలో ఆయన తన కుమారుడు లాంచింగ్ ప్లాన్ చేసారు. అయితే కొంత భాగం తీసాక ఆయనకు నచ్చక అతన్ని తీసేసారు. ఆ తర్వాత అదే కథతో సీతారామశాస్త్రి గారబ్బాయితో సినిమా తీసి కేక పెట్టించాడు తేజ. దాంతో రాజుగారి డెశిషన్ కరెక్టేనని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు పూర్తి స్ధాయిలో స్క్రిప్టుతో,స్టోరీ బోర్డుతో సహా కరుణాకరన్ ఆయన్ను సంప్రదించటం ఆనందపరిచి ఓకే చేసారట. అందులోనూ ఆ మద్య ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంతో ఓ కొత్త హీరోని పరిచయం చేయటం కూడా రాజు గారిని సంతృప్తి పరిచిందని వినికిడి. అన్ని అనుకూలిస్తే వచ్చే నెలలోనే ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశముంది.
Story first published: Saturday, January 17, 2009, 17:13 [IST]