కరుణాకరన్ మళ్ళీ క్లిక్ అయ్యాడు
ఈ వారం నాలుగు స్ట్రయిట్ సినిమాలు ,ఒక డబ్బింగ్ సినిమా రిలీజయ్యాయి.స్ట్రయిట్ సినిమాల విషయానికొస్తే కరణాకరన్ దర్శకత్వంలో యశోసాగర్,స్నేహ ఉల్లాల్ జంటగా నటించినఉల్లాసంగా...ఉల్లాసంగా సినిమా బావుందని టాక్ తెచ్చుకుంది. ఇక మూడు సినిమాలైన మా ఆయన చంటి పిల్లాడు ,ఇట్లు నీ వెన్నెల,కృషి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. శివాజీ హీరోగా రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో వచ్చిన మా ఆయన చంటి పిల్లాడు రొటీన్ కామిడీతో ప్రేక్షకులను అసహనానికి గురిచేసే విధంగా ఉంది.నూతన దర్శకుడు మామిడి కృష్ణ రూపొందించిన ఇట్లు నీ వెన్నెల చిత్రం కె.విశ్వనాధ్ సీతామహాలక్ష్మి పోలికలతో సినిమా బ్యాక్ డ్రాప్ లో వచ్చింది.
కానీ కథ అదే కాలంలో ఆగి పోవటంతో ఈ కాలం ప్రేక్షకులకు పట్టేటట్లు కనపడటం లేదు. పల్లె బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కృషి ఫలించలేని ఖాళీగా ఉన్న ధియోటర్లు చెబుతున్నాయి.ఇక తమిళ డబ్బింగ్ చిత్రం ఆర్య ఎంబిబియస్ సినిమా కూడా రొటీన్ కథతో ఏ మాత్రం ఆకట్టుకునే స్ధాయిలో లేదు. ఇక గత వారం రిలీజైన కళ్యాణరామ్ హరే రామ్ చిత్రం కలక్షన్స్ లో పెద్దగా మార్పులేదని తెలుస్దోంది. దశావతారం యాభై రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. రెడీ చిత్రం రిపీట్ ఆడియన్స్ తో కళకళ్ళాడుతోంది.యూత్ కి కరుణాకరన్ సినిమా నచ్చుతోంది కాబట్టి ఆ సినిమా నిలబడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications