మహేష్ బాబు రికమెండ్ చేసిన సింగర్
ప్రిన్స్ మహేష్ బాబు తనని రికమెండ్ చేయబట్టే 'ఫిర్ మిలే సుర్..గా' ప్రాజెక్టులో తన భాగస్వామం ఏర్పడిందని సింగర్ కారుణ్య చెప్తున్నారు. ఇరవై మూడేళ్ళ కారుణ్య ఇండియన్ ఐడిల్ ద్వారా అందరికి సుపరిచితుడే. ఆయన వాయిస్ ఆఫ్ ది ఆంద్రప్రదేశ్ అనే పోగ్రామ్ ని ఓ ప్రెవేట్ టీవీ ఛానెల్ కోసం నిర్వహిస్తున్నారు. ఆయనకు 'ఫిర్ మిలే సుర్..గా'పాటలో పాలుపంచుకోమంటూ ఆఫర్ వచ్చింది. ఈ విషయమే చెబుతూ నాకు అంతటి గొప్ప గీతంలో నా గొంతు కలపటానికి అవకాశమొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు కైలాస్ సురేంద్రనాధ్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. అప్పుడు తెలిసింది నన్ను మహేష్ రికెమెండ్ చేసారని అన్నారు ఉద్వేగంగా. ఇంతకుముందు మహేష్ సైనికుడు చిత్రంలో కారుణ్య ఓ పాట పాడారు.
ఇక గణతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ప్రసారం కానున్న 'ఫిర్ మిలే సుర్..గా' గీతంలో ఆంధ్రప్రదేశ్ తరుపున మహేష్ ని సెలక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరో అరుదైన గౌరవం దక్కింది. మహేష్ కూడా ఈ దేశభక్తి కి చెందిన ప్రాజెక్టును సంతోషంగా ఒప్పుకున్నాడు. దాదాపు ఇరవై సంవత్సరాల క్రిందట దేశవ్యాప్తంగా దూరదర్శన్ లో ప్రసారం అయి ప్రజలను ఉత్సాహపరిచిన బహుభాషా జాతీయ సమైక్య గీతం 'మిలే సుర్ మేరా తుమ్హారా' కి తాజా వెర్షన్ 'ఫిర్ మిలే సుర్..గా'. ఇక కొత్తగా చిత్రీకరణ జరుపుకొన్న ఈ గీతానికి పి.వైద్యనాథన్ తో పాటు సహ స్వరకర్తగా ఉన్న లూయీ బాంక్స్ స్వరకల్పన చేశారు. కైలాస్ సురేంద్రనాథ్ ఈ గీత చిత్రీకరణకు దర్శకత్వం హించారు. ఈ గీతాన్ని బెనెట్, కోలమన్ సంస్థకు చెందిన 'జూమ్' ఛానల్ సమర్పిస్తోంది.


Click it and Unblock the Notifications











