Rahul Gandhi పై కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు దారుణ కామెంట్.. అదే నిజమైంది అంటూ ట్వీట్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు పడటంపై సినీ ప్రముఖులు ఘాటుగా స్పందిస్తున్నారు. కొందరు రాహుల్‌కు అనుకూలంగా, మరికొందరు ప్రతికూలంగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. కొద్దికాలం క్రితం మోదీ ఇంటి పేరు ఉన్న వారందరూ దొంగలు అని రాహుల్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి.
రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కోర్టులో దాఖలైన పిటిషన్‌పై సూరత్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దాంతో నేర చరిత్ర కలిగిన ఎంపీ అంటూ పార్లమెంట్ రాహుల్‌పై అనర్హత వేటు వేసింది. అయితే కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాను తెరకెక్కించిన వివేక్ రంజన్ అగ్నిహోత్రి తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అయిది. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళితే..

అనర్హత వేటు పడిన రాహుల్ గురించి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేస్తూ.. రాజకీయాల్లో అర్హత లేని నేత రాహుల్ గాంధీ. అయితే ప్రస్తుతం అధికారికంగా రుజువైంది అంటూ ట్వీట్ చేశారు.
గతంలో ఇందిరాగాంధీపై కూడా అనర్హత వేటు వేశారు. అప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు ఏదో ఏదో మాట్లాడారు. ఇందిరా గాంధీ నిజాయితీతో కూడిన నేత కాబట్టి.. తిరిగి రాజకీయాల్లో అగ్రనేతగా నిలబడ్డారు. ప్రస్తుతం మాస్ లీడర్ లేని పార్టీ కాంగ్రెస్. అలాంటి పార్టీ తిరిగి పుంజుకొంటుందనే ఆశ కనిపించడం లేదు అని అన్నారు. ఒకవేళ గాంధీ కుటుంబం కాశ్మీర్ కాపాడి ఉంటే.. కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాను తీసి ఉండేవాడిని కాదు అని వివేక్ అగ్నిహోత్రి తెలిపారు.


Click it and Unblock the Notifications











