twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మూడు దశాబ్దాల తర్వాత కాశ్మీర్‌ లో మొట్ట మొదటి మల్టీప్లెక్స్‌.. ఆమిర్ ఖాన్ సినిమాతో షోలు మొదలు!

    |

    మత విద్వేషాలతో ఉగ్రవాదానికి సంబంధించిన వివాదాలతో వార్తల్లో నిలిచే కాశ్మీర్లో మొదటిసారి ఒక మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ ను ప్రారంభించారు. ఇక్కడ చాలాకాలంగా అనేక రకాల వివాదాలు కారణంగా సినిమా ధియేటర్లను నిర్మియించడానికి కూడా చాలా కంపెనీలు భయపడ్డాయి. ఇక అక్కడి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మొట్టమొదటి మల్టీప్లెక్స్ థియేటర్ సెప్టెంబర్ 20 తేదీన గ్రాండ్ గా మొదలుపెట్టారు. శ్రీనగర్లో ఐనాక్స్ పేరుతో రూపొందించిన ఈ మల్టీప్లెక్స్ లాంచ్ లో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

    ఆయన చేతుల మీదుగానే మొదట స్క్రీనింగ్ చేయబడిన ఈ మల్టీప్లెక్స్ మొదలవడంతో కాశ్మీర్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 90 కాలంలోనే తీవ్రవాద దాడుల నేపథ్యంలో బెదిరింపుల వలన ఎక్కడ కూడా మల్టీప్లెక్స్ లను మొదలుపెట్టింది లేదు. ఇక సెప్టెంబర్ 20న అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' ప్రత్యేక ప్రదర్శనతో మల్టీప్లెక్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    Kashmir gets its first multiplex after three decades Screens Lal Singh Chaddha On Day 1

    అలాగే సెప్టెంబర్ 30 నుండి హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ నటించిన విక్రమ్ వేద సినిమా ప్రదర్శనతో రెగ్యులర్ షోలు ప్రారంభమవుతాయి. కాశ్మీరీ హస్తకళలు సినిమా హాల్‌లో హైలెట్ కానున్నాయి. అలాగే థియేటర్ ప్రాంగణంలో స్థానిక వంటకాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. కాశ్మీర్‌లోని మొదటి మల్టీప్లెక్స్‌ అయిన ఐనాక్స్ లో మొత్తం 520 సీట్ల సామర్థ్యంతో మూడు సినిమా థియేటర్లు ఉంటాయి. మెరుగైన ఆడియో కోసం డాల్బీ సౌండ్ సిస్టమ్‌లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయని యాజమాన్యం తెలిపింది. ఈ మల్టీప్లెక్స్ ప్రాజెక్టు చైర్మన్ విజయ్ ధర్ మాట్లాడుతూ కాశ్మీర్ వెలుపల యువతకు ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో అదే సౌకర్యాన్ని సినిమా హాల్ లో పొందుతారని అన్నారు. అలాగే ప్రస్తుతం కాశ్మీర్లో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ముందుగానే పోలీసులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక థియేటర్కు కూడా ప్రత్యేకంగా కొన్ని రోజులపాటు సెక్యూరిటీ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

    English summary
    Kashmir gets its first multiplex after three decades Screens Lal Singh Chaddha On Day 1
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X