అమృతం సేవిస్తూ. స్వర్గంలో రేణు దేశాయ్... ఎక్కడుందో తెలుసా?
Recommended Video

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆయనతో విడిపోయిన తర్వాత కూడా పలు సందర్భాల్లో ఆయన గురించి ప్రస్తావనతో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో పవన్ ప్రస్తావన తేవడం పూర్తి గా మానేశారు. తాను ఏదైనా కామెంట్ చేస్తే..... ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడే అవకాశం ఉండటంతో ఆమె పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మాటీవీలో ఓ డాన్స్ రియాల్టీషోకు జడ్డిగా వ్యవహరించిన ఆమె ఇపుడు కాస్త సమయం దొరకడంతో కిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు.

స్వర్గంలో రేణు దేశాయ్
ఇండియాలో స్వర్గం లాంటి ప్రదేశం అంటే కాశ్మీర్ లోయ. ప్రస్తుతం రేణు దేశాయ్ ఈ స్వర్గంలోనే గడుపుతున్నారు. అంతే కాదు అక్కడ అమృతం లాంటి ఓ పానీయం సేవిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

కాశ్మీర్ స్వర్గం అయితే, కహ్వా అమృతం
కాశ్మీర్ స్వర్గం అయితే.... ఇక్కడ దొరికే కహ్వా అనే పానీయం అమృతం లాంటిది. కాశ్మీర్ గ్రీన్ టీ ఆకులు, సుగంధ ద్రవ్యాలు, నట్స్, కుంకుమ పువ్వు లాంటివి కలిపి 'సమోవర్' అనే సంప్రదాయ ఫిల్టర్‌లో ఈ పానీయాన్ని తయారు చేస్తారని రేణు దేశాయ్ తెలిపారు. కహ్వా గురించి రేణు దేశాయ్ వర్ణించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది.

నిర్మాతగా, దర్శకురాలిగా ఫెయిల్యూర్
పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పూణెలో సెటిలయ్యారు. మరాఠీ ఇండస్ట్రీలో నిర్మాతగా, దర్శకురాలిగా తన కెరీర్ మొదలు పెట్టారు. 2013, 2014లో ఆమె చేసిన ‘మంగళాష్‌తక్ వన్స్ మోర్', ‘ఇష్క వాలా లవ్' చిత్రాలు విడుదలైన బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. అప్పటి నుండి రేణు దేశాయ్ నుండి సినిమాలేవీ రాలేదు.

టీవీ షోల వైపు..
పవన్ కళ్యాణ్ సినిమాలతోనే తన నట జీవితానికి స్వస్తి చెప్పిన రేణు దేశాయ్... మళ్లీ నటన వైపు వెళ్లడానికి ఇష్టపడలేదు. దర్శకత్వం, నిర్మాణం వైపు వెళ్లి చేతులు కాల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె టీవీ రియాల్టీ షోల వైపు మొగ్గు చూపారు.

రేణు దేశాయ్ నెక్ట్స్ ఏమిటి?
రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరించిన ‘నీతోనే డాన్స్' రియాల్టీ షో గ్రాండ్ ఫినాలే ఇటీవలే ముగిసింది. మరి దీని తర్వాత నెక్ట్స్ సీజన్ ఉంటుందా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు. మరి ఆమె నెక్ట్స్ ఏం చేయబోతున్నారు? అనే విషయమై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











