శ్వేతాబసు సినిమాకు తెలంగాణ ఎఫెక్టు
వైభవ్, శ్వేతాబసు కాంబినేషన్ లో రూపొందిన 'కాస్కో' చిత్రం డిసెంబర్ 11న రిలీజ్ చేస్తామని మొదట ప్రకటించారు. అయితే ఇప్పుడా డేట్ ను మారుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తెలంగాణ ఇష్యూ ఎఫెక్టు తన చిత్రంపై పడే అవకాశం ఉందని డిసెంబర్ 18కి మారుస్తున్నారు. అయితే ఆ డేట్ కూడా క్లియర్ గా చెప్పటం కష్టమేనని..డిసెంబర్ చివర వారంలో ఉండవచ్చునని ఆ చిత్ర నిర్మాత కోదండరామి రెడ్డి అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని సిక్స్ టీన్స్, గర్లెప్రెండ్, సీమ శాస్త్రి, గుడ్ బోయ్ వంటి చిత్రాలు దర్శకత్వం వహించిన నాగేశ్వరరెడ్డి దీనిని డైరక్ట్ చేసారు. కామిడీకి యాక్షన్ తో సమానంగా ప్రయారిటీ ఇచ్చారని తెలుస్తోంది. హీరో వైభవ్ తన మనస్సుకు నచ్చిన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నట్లు చెప్తున్నారు. వైభవ్ గతంలో గొడవ, సరోజ చిత్రాలలో నటించారు. శ్వేతాబసు తన రైడ్ చిత్రం అనంతరం చేస్తున్న చిత్రం ఇదే.


Click it and Unblock the Notifications











