twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడుపై చెక్‌ బౌన్స్ కేసు.. హై కోర్టుకి

    By Srikanya
    |

    చెన్నై: స్టార్ హీరో ధనుష్ తండ్రి, ప్రముఖ తమిళ దర్శకుడు కస్తూరిరాజాపై చెక్‌ బౌన్స్ కేసు నమోదు చేయాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కస్తూరిరాజా తన నుంచి రూ.65 లక్షలు అప్పు తీసుకున్నారని సినీ ఫైనాన్షియర్‌ బోత్రా పేర్కొన్నారు. ఈ మొత్తం తిరిగి చెల్లించేందుకు చెక్కు ఇచ్చారని, అయితే బ్యాంకులో నగదు లేకపోవడంతో బౌన్స్‌ అయిందన్నారు. ఇందుకు సంబంధించి నగర పోలీసు కమిషనర్‌ వద్ద ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు.

    కస్తూరి రాజాపై మోసం కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పిటిషన్‌పై న్యాయమూర్తి ఆర్ముగస్వామి సమక్షంలో విచారణ జరిగింది. నగర పోలీసు కమిషనర్‌ రెండు వారాల్లో రిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. ఇక గతంలోనూ కస్తూరి రాజా తెలుగు నిర్మాత నట్టికుమార్ తో వివాదమై కేసులో ఇరుక్కున్నారు. ధనుష్‌ తండ్రి కస్తూరి రాజా '3' చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం తెలుగు హక్కులను పొందిన నట్టి కుమార్‌ నుంచి రాజా అనేక వివాదాలను, అభియోగాలను ఎదుర్కొన్నారు. అప్పట్లో ఈ చిత్రం రైట్స్‌ కొనుగోలు చేయటం వల్ల తానెంతో నష్టపోయానని, రాజా అందుకు పరిహారంచెల్లించాలని కోరారురు నిర్మాత నట్టి కుమార్‌. వీటిని తిప్పికొడుతూ, ఒప్పందం ప్రకారం ఆ చిత్రం రైట్స్‌ను తాను అమ్మానని, నట్టికుమార్‌ తనపై వెూపే అభియోగాల్లో ఎలాంటి నిజం లేదని కస్తూరి రాజా పేర్కొన్నారు.

    నట్టికుమార్‌ ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయ్యాయని, దాంతో తానెంతో నష్టపోయానని కస్తూరి రాజా పేర్కొన్నారు. నట్టి నిరాధారమైన అభియోగాలను చూసి పోలీసులు కూడా నవ్వుకుంటున్నారు. నన్ను, నా కొడుకు ధనుష్‌ను, కోడల్ని వివాదాల్లోకి లాగితే, అతనిపై నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేయడం తప్ప, వేరే గత్యంతరం లేదన్నారు కస్తూరి రాజా. రాజా మాటలను ఖండిస్తూ, రాజాతో కుదుర్చుకున్న ఒప్పందానికి తగ్గ అన్ని ఆధారాలు తనవద్ద వున్నాయని, మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాటిని బహిర్గతపరుస్తానని, అతడన్నీ అబద్ధాలు చెబుతున్నాడని, నట్టి కుమార్‌ సమాధానం ఇచ్చారు. మళ్లీ ఈ సారి కోర్టు కేసులో కస్తూరి రాజా ఇరుక్కోవటంతో హాట్ టాపిక్ గా మారింది.

    English summary
    Film Financier Botra filed a case against Director Kasthuri Raja for dishonoring cheques worth Rs 65 lakhs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X