రజినీకాంత్‌పై కస్తూరి సంచలన పోస్ట్: ఆయన అక్కడికెళ్లడం ఓ మిస్టరీ.. జయలలితలా అవకూడదంటూ షాకింగ్‌గా!

ఏజ్ బార్ అవుతోన్నా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ క్రమంలోనే ఆయన వీలు చిక్కినప్పుడల్లా అమెరికాకు పయణం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో అక్కడే ఉన్నారు. ఆయన ఆస్పత్రిలో ఉన్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఈ సారి మాత్రం ఆయన ఆరోగ్య సమస్య వల్ల అక్కడి వెళ్లినట్లు అందరికీ క్లారిటీ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ నటి కస్తూరి తాజాగా రజినీకాంత్‌పై సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు. ఇందులో షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. ఆ సంగతులు మీకోసం!

అమెరికాలో రజినీ.. ఆ ఫొటోతో సందేహాలు

అమెరికాలో రజినీ.. ఆ ఫొటోతో సందేహాలు

ఇటీవలే 'అన్నత్తై' షూటింగ్‌ను కంప్లీట్ చేసిన రజినీకాంత్.. కొద్ది రోజుల క్రితం అమెరికాకు పయణం అయ్యారు. దీంతో ఆయన అక్కడకు ఎందుకు వెళ్లారు? అసలేం జరుగుతుంది? అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం మేమో క్లినిక్‌ దగ్గర రజినీ ఉన్న ఫొటోలు లీకయ్యాయి. దీంతో ఆయన ఆరోగ్యంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

రజినీ పర్యటనపై కస్తూరి షాకింగ్ కామెంట్స్

రజినీ పర్యటనపై కస్తూరి షాకింగ్ కామెంట్స్

రజినీకాంత్ అమెరికా వెళ్లడంపై సీనియర్ నటి కస్తూరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు సుదీర్ఘమైన సంచలన పోస్టును పెట్టారు. అందులో 'చాలా రోజుల నుంచి అమెరికాకు భారతీయులను అనుమతించట్లేదు. అలాంటిది రజినీ అక్కడకు ఎలా వెళ్లారు. మేయో క్లినిక్ దగ్గర ఎందుకు ఉన్నారు? ఆయనకు అనుమతి ఎలా లభించింది' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

రజినీ అక్కడకు వెళ్లడం ఒక మిస్టరీ అంటూ

రజినీ అక్కడకు వెళ్లడం ఒక మిస్టరీ అంటూ

ఈ పోస్టులో 'ప్రస్తుతం అమెరికా వెళ్లాలంటే అక్కడి ఎంబసీ అందరికీ పర్మీషన్ ఇవ్వడం లేదు. హెల్త్ ఎమర్జెన్సీ అయినా ఒప్పుకోవడం లేదు. కేవలం అక్కడి వాళ్లకు, ఎన్నారైలకు మాత్రమే పర్మీషన్ దొరుకుతుంది. కానీ, రజినీకాంత్ మాత్రం భారత ప్రభుత్వ అనుమతితో అక్కడకు వెళ్లారు. ఆయన ప్రయాణం ఒక మిస్టరీలా ఉంది. దీని గురించి ఆలోచిస్తే పిచ్చెక్కుతుంది' అంటూ కస్తూరి తెలిపారు.

ఇక్కడ ఆస్పత్రుల్లేవా? ఆ దేశమే వెళ్లాలా?

ఇక్కడ ఆస్పత్రుల్లేవా? ఆ దేశమే వెళ్లాలా?

రజినీకాంత్ అమెరికాలోని మేయో క్లినిక్ దగ్గర కనిపించడంపై స్పందించిన కస్తూరి 'మేయో క్లినిక్ అంటే అది హార్ట్‌కు సంబంధించింది. అక్కడ చెకప్ చేయించుకుని సాధారణ చెకప్ అంటున్నారు. ఏ ఆయన చికిత్స తీసుకోడానికి ఇక్కడ ఆస్పత్రులు లేవా? దాని కోసమే అమెరికానే వెళ్లాలా? అసలు ఆయనకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏమిటి' అంటూ ఎన్నో రకాల ప్రశ్నలను సంధించారామె.

రజినీకాంత్ వాటి కంటే పెద్ద వ్యక్తేం కాదుగా

రజినీకాంత్ వాటి కంటే పెద్ద వ్యక్తేం కాదుగా

కస్తూరి ఈ పోస్టులో 'రజినీకాంత్‌కు రూల్స్ వర్తించవా? కరోనా సమయంలో అలాంటి ప్రముఖులే ఇలా వెళ్తుంటే.. సామాన్యులు ఎలా తీసుకుంటారు? ఆయన ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలి కదా. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా తలైవాకు రూల్స్ వర్తించవు అనే డైలాగ్ కొడతారేమో. కానీ, ఆయన రూల్స్ కంటే పెద్ద కాదు. అందుకే ఎవరైనా ఇలాంటి వాటిని ప్రశ్నించవచ్చు' అని పేర్కొన్నారు.

ఆయనకు చాలా సందర్భాల్లో మద్దతిచ్చాను

ఆయనకు చాలా సందర్భాల్లో మద్దతిచ్చాను

ఇదే పోస్టులో కస్తూరు పాత విషయాలను సైతం గుర్తు చేశారు. 'ఇప్పుడు రజినీని ప్రశ్నిస్తూ పోస్ట్ చేశానని చాలా మందికి కోపం రావొచ్చు. మరి గతంలో ఆయనకు చాలా సందర్భాల్లో నేను స్వయంగా మద్దతిచ్చాను. ఆయనతో కలిసి రాఘవేంద్ర మండపం కోసం పోరాడాను. ఈ పాస్ ప్రయాణం అప్పుడు సపోర్ట్ చేశాను. ఫ్యాన్స్ ఇవన్నీ గుర్తు చేసుకోవాలి' అంటూ చెప్పుకొచ్చారామె.

జయలలితలా అవకూడదంటూ షాకింగ్‌గా!

జయలలితలా అవకూడదంటూ షాకింగ్‌గా!

ఇక, ఈ పోస్టు చివర్లో కస్తూరి 'అందరి లాగే రజినీకాంత్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. గతంలో జరిగిన వాటిని తలుచుకునే ఈ పోస్ట్ చేస్తున్నాను. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం గురించి అందరూ తెలుసుకోవాలనుకున్నారు. అలాగే, ఇప్పుడు నేను కూడా రజినీ సమస్యను తెలుసుకోవాలనుకున్నా అంతే. ఆయన ఆరోగ్యంగా ఉండాలి' అంటూ ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X