రజినీకి దాదా సాహేబ్ ఫాల్కే.. రాజకీయ ఎత్తుగడా?.. కస్తూరి శంకర్ విశ్లేషణ వైరల్
ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం రజినీకాంత్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు. రజినీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్క్‌ను ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అయితే వీటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు నటి, విశ్లేషకురాలు కస్తూరి శంకర్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

సూర్యుడిలా..
సినీ ప్రపంచంలో గత యాభై ఏళ్లుగా సూర్యుడిలా వెలుగుతున్న రజినీకాంత్‌కు ఈ పురస్కారం ఇవ్వడంతో ఎంతో ఆనందంగా ఉందని మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. గత యాభై ఏళ్లుగా ఈ అవార్డును సినీ రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఇస్తున్నారని, అలా 51వ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం రజినీకాంత్‌కు రావడంతో ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తారని మంత్రి ప్రకటించారు.

రాజకీయ ఎత్తుగడా?
తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయనే.. ఇలా రజినీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారని కామెంట్లు వినిపిస్తున్నాయి. రజినీ అభిమానుల మద్దతు కొరకే ఇలా చేశారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే వీటిపై కస్తూరి శంకర్ అద్భుతంగా విశ్లేషించింది.

సరైన గుర్తింపు..
ఇండియన్ సినిమాకు సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం సంతోషంగా ఉంది. అలాగే ఎస్పీబీ గారిని కూడా సత్కరించుకోవాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది కస్తూరి.

డీఎంకే వాళ్లే రజినీతో సినిమా..
ఒకవేళ రజినీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం వెనుక రాజకీయ కోణం ఉందని అనుకుంటే.. అది కచ్చితంగా పొరబాటే అవుతుంది. డీఎంకేలో ఉన్న పెద్ద వాళ్లే రజినీతో సినిమాలు తీస్తున్నారు. అలాంటప్పుడు ఇది వారికి కూడా చెందుతుందని కస్తూరి చెప్పుకొచ్చింది.

రజినీ కంటే కమల్..
ఇలా దాదా సాహెబ్ ప్రకటించింది కృతజ్ఞతగా సపోర్ట్ ఇస్తారనుకుంటే అది కూడా జరగలేదు. రజినీకాంత్ కంటే కమల్ హాసన్‌కు ఇచ్చి ఉంటే అలాంటి కోణాలేమైనా ఉండేవేమో. పైగా రజినీకాంత్ రాజకీయ సన్యాసం తీసుకోవడంపై అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు..ఆయన తన వ్యక్తిగత అజెండా కోసం వారిని వాడుకోవడం లేదు అంటూ కస్తూరి విశ్లేషించింది.


Click it and Unblock the Notifications











