»   » 'అత్తారింటికి దారేది'లో పవన్‌ పాడిన పాటకు మూలం ఇదే...

'అత్తారింటికి దారేది'లో పవన్‌ పాడిన పాటకు మూలం ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ మరోసారి తన గాత్రాన్ని వినిపించాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న 'అత్తారింటికి దారేది' చిత్రం కోసం ఓ ప్రత్యేక గీతాన్ని పవన్‌ ఆలపించాడు. 'కాటం రాయుడా...కదిరి నరసింహుడా' అంటూ సాగే పాటను తివిక్రమ్‌, దేవిశ్రీప్రసాద్‌ దగ్గరుండి మరీ పవన్‌తో పాడించారు. ఈ పాట సుమంగలి (1940) అనే పాత క్లాసిక్ చిత్రంలోంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పాట లిరిక్స్ యాజటీజ్ గా ఇలాగే ఉన్నాయి. ఇక చిత్రం టైటిల్స్ లో ఈ విషయం ప్రస్తావిస్తారని భావిస్తున్నారు.

ఇక పవన్ కల్యాణ్‌సైతం ఎంతో హుషారుతో పాడిన ఈ పాటకు అభిమానులు స్టెప్పులేయక మానరు. గతంలో ఖుషి, పంజా చిత్రాల్లో తన గాత్రాన్ని వినిపించిన ఈసారి మరింత జోష్‌తో పాట పాడి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. ఈనెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ పాట యూ ట్యూబ్ లో మారు మ్రోగిపోతోంది.

మిగతా విశేషాలు..స్లైడ్ షో లో...

దేవి మాట్లాడుతూ...

దేవి మాట్లాడుతూ...

పవన్ కళ్యాణ్ తో సరదాగా ఓ బిట్ సాంగ్ పాడించాం. ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేద్దామని, దాన్ని ఆల్బమ్‌లో చేర్చలేదు అంటూ చెప్పుకొచ్చారు దేవిశ్రీ ప్రసాద్. ఇటీవల జరిగిన ‘అత్తారింటికి దారేది' చిత్రంలో బ్రహ్మానందం ఓ కామెంట్ చేసారు. అన్నీ పాటలు విడుదల చేసారు కానీ...ఒక సాంగును ఎందుకో ఆపేసారూ అని. విడుదల చేయని ఆ సాంగు ఏమిటో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ సాంగులో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందాన్ని టార్గెట్ చేస్తూ పాడారు. ఇప్పుడు ఆ పాటే అంతటా వినపడుతోంది.

సెన్సార్ అభినందన

సెన్సార్ అభినందన

పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రూపుదిద్దుకున్న 'అత్తారింటికి దారేది' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ పొందింది. సినిమాని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ చెప్పారు. చక్క ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీశారని సెన్సార్ సభ్యులు అభినందించినట్లు ఆయన తెలిపారు.

బిగ్గెస్ట్ మూవీ...

బిగ్గెస్ట్ మూవీ...

'మా సినిమాలో పవన్‌కళ్యాణ్ ఓ పాట పాడారు. దానికి సంబంధించిన వీడియోను యూ ట్యూబ్‌కి, ఛానల్స్‌కి విడుదల చేసాం. మంచి స్పందన వచ్చింది. మా బేనర్‌లో ఇది బిగ్గెస్ట్ మూవీ అవుతుందన్న నమ్మకం నాకుంది' అన్నారాయన. సమంత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఫైట్స్: పీటర్ హెయిన్స్, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు.

ఆడియోకి మంచి స్పందన

ఆడియోకి మంచి స్పందన

"ఆడియో రిలీజ్ అయిన రోజు నుంచే అద్భుతమైన స్పందన వచ్చి రికార్డులు సృష్టించింది. ఎక్కడ విన్నా 'అత్తారింటికి దారేది' పాటలే వినిపిస్తున్నాయి. ఈ క్రెడిట్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కూ, గేయ రచయితలకూ దక్కుతుంది. అలాగే ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ అనూహ్యం. సినిమా సైతం అదే ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది'' అని ఆయన చెప్పారు.

డైలాగ్స్ అదుర్స్

డైలాగ్స్ అదుర్స్

‘చూడప్పా సిద్ధప్పా...నేను సింహం లాంటి వాణ్ని. అది గెడ్డం గీసుకోలేదు...నేను గీసుకోగలను అంతే తేడా..మిగతాదంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా..అని ‘అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ పలికిన డైలాగ్స్ ఆయన అభిమానుల్ని అలరిస్తున్నాయి. ఇంక సినిమా రిలీజయ్యాక మరిన్ని డైలాగులు పాపులర్ అవుతాయి.

గౌతమ్ నందగా..సూపర్బ్..

గౌతమ్ నందగా..సూపర్బ్..

గౌతమ్ నందగా పవన్‌కల్యాణ్ పండించిన వినోదం చూడాలంటే 9న ‘అత్తారింటికి దారేది' సినిమా చూడాల్సిందే. పవన్ నటన, త్రివిక్రమ్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇద్దరు హీరోయిన్స్ ప్రణీత, సమంత మధ్య పవన్ చేసే కామెడీ ఓ రేంజిలో ఉంటుందంటున్నారు. అలాగే అత్త నదియా, పవన్ ల మధ్య సన్నివేశాలు సైతం సినిమాకు బాగా హెల్ప్ అవుతాయంటున్నారు.

అందుకే వాయిదా...

అందుకే వాయిదా...

తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 9కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. థియేటర్ల అడ్జెస్ట్ మెంటే ఈ వాయిదాకు కారణంగా తెలుస్తోంది. ఈ విడుదల వెనక ఓ సెంటిమెంటు కారణం కూడా వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘జులాయి' గత సంవత్సరం ఆగస్టు 9నే విడుదలయింది. ఈ నేపథ్యంలో దర్శకుడు సెంటిముంటుగా భావించి రిలీజ్ డేట్ మార్చినట్లు తెలుస్తోంది. పవన్ ‘అత్తారింటికి దారేది' వాయిదా పడింది అత్తారింటికి దారేది మరో వైపు ‘అత్తారింటికి దారేది' చిత్రం శుక్రవారం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ ‘U' సర్టిఫికెట్ పొందింది. దీంతో ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా అని స్పష్టం అయింది.

ఎవరెవరు..

ఎవరెవరు..

ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, నదియా, ముఖేష్‌రుషి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, హంసానందిని, ముంతాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీవూపసాద్, ఫోటోక్షిగఫీ: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కోపొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్

సుమంగలిలో పాట లింక్ ..

ఈ పాట సుమంగలి (1940) అనే పాత క్లాసిక్ చిత్రంలోంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పాట లిరిక్స్ యాజటీజ్ గా ఇలాగే ఉన్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ పాడిన పాట లింక్...

విక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న 'అత్తారింటికి దారేది' చిత్రం కోసం ఓ ప్రత్యేక గీతాన్ని పవన్‌ ఆలపించాడు. 'కాటం రాయుడా...కదిరి నరసింహుడా' అంటూ సాగే పాటను తివిక్రమ్‌, దేవిశ్రీప్రసాద్‌ దగ్గరుండి మరీ పవన్‌తో పాడించారు.

English summary
The original version Katama rayuda kadiri narasimhuda from Telugu movie Sumangali (1940). Pawan Kalyan's Kaatam Rayuda song has been released just days ahead of the film's release - Attarintiki Daredi, directed by Trivikram Srinivas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu