‘కాటమరాయుడా...’ టైటిల్ తో చిత్రం

'కాటమరాయుడా...' అనేది ఈ టైటిల్ తో ఫిల్మోత్సవ్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ పతాకంపై చంద్రసిద్దార్థ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్‌కి వెళ్లనుంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ టైటిల్ కి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.
చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతోన్న చిత్రం 'ఏమో గుర్రం ఎగురావచ్చు'. సుమంత్, పింకీ సావిక జంటగా చేసిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చంద్రసిద్దార్థ్ భిన్నమైన కథాంశంతో ఈ కాటమరాయుడా సినిమా చేయబోతున్నారు.
ఇక టైటిల్ అనేది సినిమాకు ఓ క్రేజ్ తెచ్చే ఎలిమెంట్. పెద్ద హీరోల సినిమాలకు హీరోని టార్గెట్ చేస్తూ టైటిల్స్ పెడతారు. అలాగే చిన్న హీరోల సినిమాలకు ఆ సినిమా కాన్సెప్ట్ ని బట్టి టైటిల్స్ పెట్టి ఆసక్తి క్రియేట్ చేస్తూంటారు. అంతేగాక జెనర్ ని బట్టి కూడా టైటిల్స్ మారిపోతూంటాయి. టైటిల్స్, ప్రోమోలతోనే క్రేజ్ క్రియేట్ అయ్యి, హీరోలతో సంభంధం లేకుండా ..థియోటర్స్ కు ఓపినింగ్స్ కూడా చాలా సార్లు వస్తూంటాయి. అందులోనూ ఈ మధ్య కాలంలో టైటిల్స్ కీలక అంశంగా మారాయి.
పవన్‌కల్యాణ్ 'అత్తారింటికి దారేది' చిత్రంలోని పాటలోని 'ఆరడుగుల బుల్లెట్' టైటిల్ తో ఏ హీరో సినిమా చేస్తాడనేది అందరిలో చాలా సస్పెన్స్ గా ఉంది. అయితే ఈ టైటిల్ తో త్వరలో లాంచ్ అవుతున్న మరో మెగా హీరో వరుణ్ తేజ చిత్రం చేస్తారని సమాచారం. ఈ టైటిల్ పెట్టడంతో పవన్ బ్రాండ్ కూడా యాడ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేయనున్నట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











