అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్.... (కాటమరాయుడు ట్రైలర్)
శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు.
హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై కిషోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం కాటమరాయుడు.శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ లో అభిమానులను అలరించబోతున్నాడు.
ఇందులో కాటమరాయుడు అమ్మాయిలంటే భయపడతాడు. అందుకే పెళ్లికి కూడా దూరంగా ఉంటాడు. అమ్మాయిలంటే డేంజర్ అనే అభిప్రాయంలో ఉండే అతడు ఎలా ప్రేమలో పడ్డాడు? అన్నయ్యకు పెళ్లి చేయడానికి తమ్ముళ్లు ఏం చేసారు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ఇక కాటమరాయుడు మూవీ మార్చి 24న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వడం... క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం కూడా జరిగిపోయింది. డాలీ(కిషోర్ పార్దసాని) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











