కాటమరాయుడు చిత్రంలోని ఎద్దు మృతి.. సైరాలో కూడా, అప్పటి నుంచి తిరుగులేకుండా!

Recommended Video

Pawan Kalyan's Ox Had Its Last Rites

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం 2017 లో విడుదలైంది. పవన్ కళ్యాణ్ పంచె కట్టు లుక్ లో కనిపించిన చిత్రం ఇది. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రం అభిమానులని నిరాశపరిచింది. కిషోర్ పార్థసాని ఈ చిత్రానికి దర్శకుడు. శరత్ మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీని అభిమానులు ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు. ఇంట్రడక్షన్ సీన్ అంతలా అలరించింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ లో కనిపించిన ఎద్దు కూడా ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఎంట్రీ సీన్ అదుర్స్

ఎంట్రీ సీన్ అదుర్స్

కాటమరాయుడు చిత్రం అభిమానులని నిరాశపరిచినప్పటికీ ఎంట్రీ సీన్ మాత్రం అదిరిపోయింది. ఇంటిముందు ఎద్దు అదుపు తప్పి రంకెలు వేస్తున్న సమయంలో కాటమరాయుడు ఎంట్రీ ఇచ్చి ఎద్దుని శాంతిపజేస్తాడు. ఆ సన్నివేశం విజిల్స్ కొట్టించేవిధంగా ఉంటుంది.

సైరా చిత్రంలో కూడా

సైరా చిత్రంలో కూడా

ఈ ఎద్దుపై మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రంలో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. సైరా నరసింహారెడ్డి చిత్ర షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

మృతి చెందిన ఎద్దు

మృతి చెందిన ఎద్దు

ఆ ఎద్దు తాజగా మృతి చెందింది. ప్రకాశం జిల్లాకు చెందిన నవనీతాకృష్ణకు చెందినది ఈ ఎద్దు. వారంరోజులుగా అనారోగ్యంతో భాదపడుతూ మృతిచెందినట్లు అతడు తెలిపాడు.

ఒకే తల్లికి

ఒకే తల్లికి

నవనీత కృష్ణ వద్ద మృతి చెందిన ఎద్దుతో పాటు దీనికి జతగా మరో ఎద్దుకూడా ఉంది. వీటిని బ్లాక్ బ్రదర్స్ అని పిలుచుకునేవారట. ఈ రెండు ఎద్దులు ఒకే తల్లికి జన్మించాయి.

తిరుగులేదు

తిరుగులేదు

ఈ ఎద్దుల జంటకు పోటీల్లో 2015 నుంచి తిరుగులేకుండా విజయం సాధిస్తున్నాయి. 10 సార్లు ప్రథమ బహుమతి, 15 సార్లు ద్వితీయ బహుమతి సాధించాయి. మృతి చెందిన ఎద్దుకు అంత్యక్రియలు కూడా నిర్వహించినట్లు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X