twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ పయనమైన పవన్ కళ్యాణ్ మూవీ.. ఆసక్తికర టైటిల్ పెట్టేశారు

    |

    సినీ ఇండస్ట్రీలో రీమేక్ సినిమా రావడం అనేది కామన్ జరిగే పరిణామమే అయినా కొన్ని సినిమాల రీమేక్‌ల పట్ల జనాల్లో ఏదో తెలియని ఆసక్తి నెలకొంటూ ఉంటుంది. తాజాగా అలాంటి ఓ సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ సినిమాకు ఎదురైంది. ఆయన హీరోగా వచ్చిన కాటమరాయుడు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అన్నట్లుగా ఉంది బాలీవుడ్ కాటమరాయుడు.

    2017 సంవత్సరంలో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన 'కాటమరాయుడు' సినిమాను యధాతథంగా హిందీలో రీమేక్ చేయబోతున్నారు డైరెక్టర్ ఫర్హాద్‌ సమ్జీ. బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ ఇందులో హీరోగా నటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలుత అక్షయ్‌ కుమార్‌ హీరోగా ఈ రీమేక్ మూవీ రూపొందించాలని ప్లాన్ చేశారు. కానీ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అక్షయ్‌ కుమార్ డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఉండటంతో విక్కీని సంప్రదించారట దర్శకనిర్మాతలు.

    Katamarayudu Remake Is Ready To Go On Sets

    వెంటనే విక్కీ ఓకే చెప్పేయడంతో అన్నీ సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమాకు సాజిద్‌ నదియాద్‌వాలా నిర్మాతగా వ్యవహరించనున్నాడని, అదేవిధంగా 'ల్యాండ్‌ ఆఫ్‌ లుంగీ' అనే ఆసక్తికర టైటిల్ ఈ సినిమాకు కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. దీని గురించి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    కాగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్. సమాజంలో పేరుకుపోతున్న అవినీతిని వెలికి తీస్తానని గెంతేట్టి చాటినప్పటికీ పవన్ మాటలు జనం అస్సలు పట్టించుకోలేదు. దీంతో కేవలం ఒక్క సీటుతోనే బయటపడిన జనసేనాని ఇక రాజకీయం, సినిమాల పరంగా ఎలాంటి అడుగులు వేయనున్నారనే కోణంలో జనంలో ఆసక్తి కనిపిస్తోంది. ఈ ఆసక్తిని గమనించిన పవన్.. తాను ఇప్పట్లో సినిమాలు చేసే ప్రసక్తే లేదని, ఎన్నాళ్లయినా రాజకీయ జీవితంలోనే కాలం గడుపుతానని చెప్పడం గమనార్హం.

    English summary
    Pawan Kalyan's 2017 action masala film, Katamarayudu, is now going for a Hindi remake.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X