»   » కేవలం 15 నిమిషాలే.. హాట్‌కేకుల్లా కాటమరాయుడు టికెట్లు.. నిరాశలో ఫ్యాన్స్

కేవలం 15 నిమిషాలే.. హాట్‌కేకుల్లా కాటమరాయుడు టికెట్లు.. నిరాశలో ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారీ అంచనాల మధ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం మార్చి 24న (శుక్రవారం) విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ అప్పుడే మొదలు కాగా దానికి అనూహ్య స్పందన కనిపిస్తున్నట్టు సమాచారం.

హాట్‌కేకుల్లా టికెట్లు

హాట్‌కేకుల్లా టికెట్లు

ఆన్‌లైన్ మూవీ టికెట్స్ వెబ్‌సైట్ల నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ.. కాటమరాయుడు టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. సినీ అభిమానుల నుంచి అడ్వాన్స్ బుకింగ్ భారీ స్పందన కనిపిస్తున్నది అని తెలిపారు.


ట్రైలర్‌కు ముందే

ట్రైలర్‌కు ముందే

కాటమరాయుడు చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రేలర్ ఇంకా విడుదల కాకముందే ముందస్తు బుకింగ్‌‌కు భారీ స్పందన రావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కేవలం పవన్ కల్యాణ్ అభిమానుల వల్లనే అడ్వాన్స్ బుకింగ్‌కు స్పందన వస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


టీజర్, ఆడియోకు గుడ్ రెస్పాన్స్

టీజర్, ఆడియోకు గుడ్ రెస్పాన్స్

సోషల్ మీడియా ద్వారా విడుదలైన పాటలు, టీజర్లకు మంచి రెస్సాన్స్ వచ్చింది. టీజర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


నేడే ప్రీ రిలీజ్.. ట్రైలర్ ఆవిష్కరణ

నేడే ప్రీ రిలీజ్.. ట్రైలర్ ఆవిష్కరణ

కాటమరాయుడు ట్రైలర్ ఆవిష్కరణ కోసం శనివారం (మార్చి 18) ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత టికెట్ల అమ్మకాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని ఆన్‌లైన్ మూవీ టికెట్స్ నిర్వాహకులు తెలిపారు.


మళ్లీ శ్రుతిహాసన్‌తో రొమాన్స్

మళ్లీ శ్రుతిహాసన్‌తో రొమాన్స్

గబ్బర్‌సింగ్‌లో పవన్ కల్యాణ్‌తో జోడికట్టిన శ్రుతిహాసన్ కాటమరాయుడులో కూడా జంటగా నటించింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రం తమిళంలో అజిత్ నటించిన వీరం చిత్రానికి రీమేక్. కాటమరాయుడు చిత్రానికి కిషోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వం వహిస్తుండగా, శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


ఫస్ట్ డే,

ఫస్ట్ డే,

ఫస్ట్ షో చూడాలనే అభిమానుల్లో కొందరికి టికెట్లు దొరకక నిరాశ గురైనట్టు తెలుస్తున్నది. మొదటి ఆట పక్కన పడితే.. తొలి రోజు టికెట్లు దొరకలేదని, దాంతో రెండో రోజుకు టికెట్ బుక్ చేసుకొన్నానని ఓ సినీ అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు.


English summary
Pawan Kalyan's Katamarayudu movie will be released on Friday, one week prior to the film's release on Mar 24. The tickets of Katamarayudu are selling like hotcakes and the bookings saw a powerful turn out.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu