twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ స్టామినా అదీ.! ఈ వివరాలు చూస్తే పిచ్చెత్తి పోయినట్టే

    ఇప్పటి వరకూ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే కాట‌మ‌రాయుడుకి దాదాపు 87 కోట్ల బిజినెస్ వచ్చిందని అంటున్నారు.

    |

    టీజర్ ఇటీవల విడుదలై కేవలం రెండు గంటల్లో మిలియన్ వ్యూస్ సాధించి యుట్యూబ్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తున్న నమ్మకం అందరికి కలిగింది. అంతే కాదు ఈ ఎఫెక్ట్ సినిమా బిజినెస్ పై కూడా పడింది.ఓ పది రోజుల క్రితం వరకూ అసలు ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. ప‌వ‌న్ స‌ర్దార్‌తో డిజాస్ట‌ర్ సినిమా ఇవ్వ‌డం, ఈ సినిమా కోలీవుడ్ హిట్ మూవీ వీర‌మ్‌కు రీమేక్‌గా వ‌స్తుండ‌డంతో పాటు గోపాల‌...గోపాల డైరెక్ట‌ర్ డాలి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డంతో ఎవ్వ‌రికి పెద్ద‌గా అంచ‌నాలు లేవు.

    ఎప్పుడైతే కాట‌మ‌రాయుడు టీజ‌ర్ రిలీజ్ అయ్యిందో లెక్క‌ల‌న్ని మారిపోయాయి. రిలీజ్ డేట్ కూడా ముందుగా అనుకున్న‌ట్టుగా మార్చి 28 కాకుండా మార్చి 24నే వ‌స్తుంద‌ని చెపుతుండ‌డంతో సినిమాపై ఒక్క‌సారిగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అన్ని ఏరియాల్లోను ప్రి రిలీజ్ బిజినెస్ అద‌ర‌గొడుతోంది.

    Katamarayudu Worldwide theatrical business is said to be prized around Rs.87 crores.
    '
    ఉత్తరాంధ్ర హక్కుల నిమిత్తం 8.3కోట్లు, సీడెడ్ నిమిత్తం 12కోట్లు, ఈస్ట్ హక్కుల కోసం 5.5.కోట్లు, వెస్ట్ కు గానూ 4.85కోట్లు, గుంటూరు 6.5కోట్లు, ఓవర్ సీస్ హక్కులకుగానూ దాదాపు 12 కోట్లు దక్కినట్టు తెలుస్తోంది. ఇంత పెద్ద సొమ్ము పలకడం తో పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించబడింది. ఈ చిత్రాన్ని మార్చి 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

    అంతే కాకుండా రిలీజ్ డేట్ కూడా మార్చి 28 కంటే ముందుగానే మార్చి 24నే వ‌స్తుంది. దీంతో 'కాటమరాయుడు' సక్సెస్ చాలా కన్ఫర్మ్ అనే కాన్ఫిడెంట్ చిత్ర యూనిట్ లో బలంగా ఉంది. దీంతో ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ సైతం ఓ రేంజ్‌ లో ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం. సినిమా రిలీజ్ నాటికి 'కాటమరాయుడు' మూవీ బిజినెస్ దాదాపు 100 కోట్ల రూపాయలు ఉంటుందని ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి.

    అన్ని ఏరియాల్లోను ప్రి రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌ లో క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకూ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే కాట‌మ‌రాయుడుకి దాదాపు 87 కోట్ల బిజినెస్ వచ్చిందని అంటున్నారు. ఇక శాటిలైట్‌ రైట్స్ హ‌క్కులతో కలుపుకుంటే ఈ చిత్రం 100 కోట్ల రూపాయల బిజినెస్ ని కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. మొత్తంగా రిలీజ్ కి ముందే 100 కోట్ల రూపాయల బిజినెస్ ని 'కాటమరాయుడు' చిత్రం క్లోజ్‌ చేయటం అనేది రికార్డ్ గా మారింది.

    English summary
    Power Star Pawan Kalyan's 'Katamarayudu's is one of the most awaited films releasing in summer. Cashing in on the actor’s craze, producers sold the film rights for huge prices. Worldwide theatrical business is said to be prized around Rs.87 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X