For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జెనీలియా 'కథ' మొదలైంది

    By Staff
    |

    ఐతే, అనుకోకుండా ఒక రోజు, అమ్మ చెప్పింది వంటి విభిన్న తరహా చిత్రాలు నిర్మించిన జస్ట్ యల్లో బ్యానర్ వారు ఇప్పుడు కథ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జెనీలియా ప్రధాన పాత్రలో చేస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రాగ అనే దర్శకుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ SOS చిల్డ్రన్స్ విలేజ్ (హైదరాబాద్)లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ ఈ కథ చిత్రం ఓ ధ్రల్లర్ అని అన్నారు. అమ్మ చెప్పింది చిత్రం రిలీజైన మూడేళ్ళ తర్వాత ఈ సినిమా అన్ని జాగ్రత్తలూ తీసుకుని ప్లాన్ చెస్తున్నాం..ఈ చిత్రం బేసిక్ గా థ్రిల్లర్ అయినా ప్రేమ కంటెంట్ అండర్ కరెంట్ గా ఉంటుంది అన్నారు.

    ఇక శ్రీనివాస్ గతంలో కోడిరామకృష్ణ వద్ద నవ్వుతూ బ్రతకాలరా, త్రినేత్రుడు, జెండా చిత్రాలకు పనిచేసారు. ఇక ఈ చిత్రంలో మరో పాత్రలో తమిళ కుర్రాడు అరుణ్ నటిస్తున్నాడు. అతను తమిళ హ్యాపీడేస్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అతనిది రచయిత పాత్ర..నేను రాసే కథే ఈ చిత్రం అంటున్నారు. సంగీత దర్శకుడుగా బాలచంద్రన్ పనిచేస్తున్న్రు. ఆయన గుణ్ణం గంగరాజుగారి సీరియల్స్ కి పనిచేసారు. బ్రహ్మాస్త్రం సినిమాకి సంగీతం అందించారు. ఇక ఈ చిత్రం హిల్ స్టేషన్ నేపధ్యంలో జరుగుతుంది. అందుకే అరుకులో ఎక్కువ భాగం షూట్ చేస్తారు. దసరాకు రిలీజ్ ప్లాన్ చేస్తున్ ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రఘుబాబు, షఫి వంటి సీనియర్స్ కీలక పాత్రల్లో నటించనున్నారు. గుణ్ణం గంగరాజు డైలాగులు అందించనున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X