కథలు కథలు విడుదలయిన 'కథ' ఆడియో
బబ్లీ గర్ల్ జెనీలియా కథానాయికగా, నూతన నటుడు అరుణ్ అదిత్ కథానాయకుడుగా, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో 'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు' వంటి సినిమాలని తీసిన దర్శకుడు గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కథ. గుణ్ణం గంగరాజు సినిమాలే కాదు, చేసే ఫంక్షన్లు కూడా వైవిధ్యంగా వుంటాయి. అందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన 'కథ' సినిమా ఆడియో ఫంక్షన్. జస్ట్ ఎల్లో మీడియా పతాకం పై రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో ఇటీవలే హైదరాబాదులో విడుదలయింది.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఈ సినిమా టైటిల్ కథను ప్రతిబింబిచేలా ఈ కార్యక్రమానికి హాజరైన సినీప్రముఖులతో గొలుసుకట్టు కథలు చెప్పించారు. తొలుత రఘుబాబు, కీరవాణి, కె.ఎల్. నారాయణ, రాజసింహలను వేదిక పైకి పిలిచి నాలుగు పదాలు ఇచ్చి వాటి ఆధారంగా కథను అల్లమన్నారు. ఈ నలుగురిలో బాగా కథను అల్లిన రాజసింహను విజేతగా ప్రకటించారు. తర్వాత అనంత్ శ్రీరామ్, బొమ్మరిల్లు భాస్కర్, జెనీలియా, ఎన్టీఆర్ లను ఆహ్వానించి వారితో కూడా కథలు చెప్పించారు. ఇందులో ఎన్టీఆర్ విజేతగా నిలిచాడు. ఇలా ఈ కర్యక్రమం అంతా సరదా సరదాగా జరిగింది. ఈ వేడుకకి తెల్లటి గౌనులో హాజరయిన జెనీలియా అందరినీ తమ చూపును తన నుండీ మరల్చకుండా చేసింది.


Click it and Unblock the Notifications











