Don't Miss!
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- News ఓటు వెయ్యకపోయినా పర్వాలేదు, నా అంత్యక్రియలకు రండి, ప్రధాని అభ్యర్థి, మోదీని టార్గెట్ చేసి !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జెనీలియా 'కథ' రిలీజ్ డేట్
గుణ్ణం గంగరాజు లేటెస్ట్ ప్రొడక్షన్ వెంచర్ కథ చిత్రం అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ధియోటర్స్ లో దిగనుంది. అరుణ్, జెనీలియా కాంబినేషన్లో రెడీ అయిన ఈ ద్రిల్లర్ లో జెనీలియా ఓ స్కూల్ టీచర్ గా కనిపించనుంది. శ్రీనివాస్ రాగ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. ఎస్.కె.బాలచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.ఆడియో ఈ నెల పదమూడున రిలీజ్ చేయనున్నారు.
ఐతే, అనుకోకుండా ఒక రోజు, అమ్మ చెప్పింది వంటి విభిన్న తరహా చిత్రాలు నిర్మించిన జస్ట్ యల్లో బ్యానర్ వారు నిర్మిస్తున్న చిత్రం కావటంతో మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. టల రచయిత, నిర్మాత అయిన గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ అమ్మ చెప్పింది చిత్రం రిలీజైన మూడేళ్ళ తర్వాత ఈ సినిమా అన్ని జాగ్రత్తలూ తీసుకుని ప్లాన్ చెస్తున్నాం..ఈ చిత్రం బేసిక్ గా థ్రిల్లర్ అయినా ప్రేమ కంటెంట్ అండర్ కరెంట్ గా ఉంటుంది అన్నారు.
ఇక శ్రీనివాస్ గతంలో కోడిరామకృష్ణ వద్ద నవ్వుతూ బ్రతకాలరా, త్రినేత్రుడు, జెండా చిత్రాలకు పనిచేసారు. ఇక ఈ చిత్రంలో మరో పాత్రలో తమిళ కుర్రాడు అరుణ్ నటిస్తున్నాడు. అతను తమిళ హ్యాపీడేస్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అతనిది రచయిత పాత్ర..నేను రాసే కథే ఈ చిత్రం అంటున్నారు. సంగీత దర్శకుడు బాలచంద్రన్ గుణ్ణం గంగరాజుగారి సీరియల్స్ కి పనిచేసారు. బ్రహ్మాస్త్రం సినిమాకి సంగీతం అందించారు. ఇక ఈ చిత్రం హిల్ స్టేషన్ నేపధ్యంలో జరుగుతుంది. అందుకే అరుకులో ఎక్కువ భాగం షూట్ చేసారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రఘుబాబు, షఫి వంటి సీనియర్స్ కీలక పాత్రల్లో నటించనున్నారు.