కోరుకున్నది దక్కకపోతే డిస్టర్బ్ అయిపోతా..క్రేజీ స్టార్..!?
ఢిల్లీలోనే పుట్టి పెరిగిన తాప్సీ ఇప్పుడు తెలుగులో క్రేజీ స్టార్. యువతరం హృదయాలకి గాలమేసిన నవ్వుల సుందరి. 'వస్తాడు నా రాజు'లో విష్ణు సరసన మెరవబోతున్న ఆమెకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. 'నాకు నచ్చిందే చేస్తా, చేయొద్దనుకున్న దాని జోలికి అసలు పోను. అదే నా బలం. కాకపోతే కోరుకున్నది ఏదైనా దక్కకపోయినా, అనుకున్నది చేయలేకపోయినా డిస్టర్బ్ అయిపోతా. అది నా బలహీనత' అంటుంది. ఆమె ఎనిమిదేళ్లపాటు కథక్ నేర్చుకుంది. 'సమయం దొరికినప్పుడల్లా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. అదే నాకు మంచి వ్యాయామం. అందుకని ఫిట్నెస్ కోసం వేరే మార్గాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు' అని చెప్పుకొస్తుంది తాప్సీ.
తాప్సీ వస్తాడు నా రాజు మంచు విష్ణువర్థన్ ఝుమ్మంది నాదం మంచు మనోజ్ tapsi vastadu naa raju manchu vishnuvardhan jhummandi naadam manchu manoj


Click it and Unblock the Notifications