‘కథనం’ టీజర్... ఇటు గ్లామర్, అటు యాక్షన్‌తో అనసూయ కేక!
యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'కథనం'. మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్, గాయత్రి ఫిల్మ్స్ బేనర్లో బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్‌నాదెండ్ల దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ మూవీ ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి.
ఉమెన్స్ డే సందర్భంగా 'కథనం' టీజర్ విడుదలైంది. రామ్ చరణ్ భార్య ఉపాసన తన ట్విట్టర్ పేజీ ద్వారా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డియరెస్ట్ అనసూయ..ఆల్ ది బెస్ట్, టీజర్ గొప్పగా ఉంది అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.

అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో అనసూయ
‘కథనం'లో అనసూయ అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా కోసం ఆమె రాసుకున్న కథలో విధంగానే హత్యలు జరుగుతుండటంతో అనసూయ ఇబ్బందుల్లో పడుతుంది. ఈ పాయింటును బేస్ చేసుకుని కథనం చిత్రం సాగుతుందని స్పష్టమవుతోంది.

గ్లామర్, యాక్షన్ సీన్స్ అదుర్స్
ఈ చిత్రంలో లుక్ పరంగా గ్లామర్‌గా కనిపించడంతో పాటు యాక్షన్ సీన్లలో కూడా అనసూయ ఇరగదీసినట్లు తెలుస్తోంది. టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఉపాసన ప్రశంసలు
టీజర్ విడుదల చేసిన అనంతరం ఉపాసన... అనసూయపై ప్రశంసల గుప్పించారు. టీజర్ గొప్పగా ఉంది, ఆల్ ది బెస్ట్ అంటూ విష్ చేశారు. దీనికి అనసూయ స్పందిస్తూ... మహిళగా మీరు ఎంతో మందికి స్పూర్తి, మా సినిమాను ప్రమోట్ చేసినందుకు థాంక్స్ అంటూ ట్వీట్ చేశారు.
కథనం
‘కథనం'లో అనసూయ భరద్వాజ్, అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్, పెళ్లి పృధ్వీ, సమీర్, ముఖ్తార్‌ఖాన్, రామరాజు, జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బాలాజీ శ్రీను, ఎడిటర్:ఎస్.బి. ఉద్దవ్, మ్యూజిక్: సునీల్ కశ్యప్, ఆర్ట్ డైరెక్టర్: కె.వి.రమణ, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: సతీష్ ముత్యాల, నిర్మాతలు: బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం:రాజేష్ నాదెండ్ల.


Click it and Unblock the Notifications











