రజనీకాంత్,జగపతి బాబు కాంబినేషన్ లో పి.వాసు దర్శకత్వం వహిస్తున్న క్రేజీ చిత్రం 'కథానాయుకుడు' .ఈ సినిమా రిలీజుని ఈ నెల 31న గాని ఒకటవ తేదీన గాని ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడది వాయిదా పడేటట్లు కనపడుతోంది. విజువల్ ఎఫెక్ట్ కి లేటయ్యేటట్లు ఉండటంతో ముందనుంచి అనుకున్నట్లుగా ఆగస్టు 15 న రిలీజ్ చేస్తే బెటరని భావిస్తున్నారట. అయితే నిర్మాతలు మాత్ర ఆగస్టు 8న రిలీజ్ చేస్తే మేలని ప్రయత్నిస్తున్నారుట. ఇక ఈ సినిమాని తెలుగులో సి.అశ్వనీదత్ అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ని బట్టి మిగతా సినిమాలు కూడా లేటయ్యే ఆస్కారం ఉంది. అయితే అధికారికంగా నిర్మాతలు ఈ న్యూస్ ని దృవీకరించలేదు.