నా విషయాలు బయట పెడితే... పవన్ కళ్యాణ్ ఎఫైర్లు, త్రివిక్రమ్ సెటిల్మెంట్లు లీక్ చేస్తా: కత్తి మహేష్

By Bojja Kumar

'కత్తి మహేష్ జనం అనుకున్నంత శ్రీరామ చంద్రుడు కాదు, చాన్స్ దొరకాలే కానీ సై అంటూ రెచ్చిపోయే రసిక రాజు. పైకి నీతులు, చట్టాలు, సభ్యత హక్కుల గురించి తెగ ప్రసంగాలు దంచేకత్తి అమ్మాయిలతో ఇటీవల చేసిన కొన్ని చాట్స్ బయట పడ్డాయి. వాటిలో పలకరింపులు, సంభాషణలు, ఆఫర్లు, శృంగార సందేశాలు చదివి జనం ఔరా అనుకుంటున్నారు. ఇండస్ట్రీలో ప్రవేశానికి ఓ దారి కావాలి, అది నేనే అనుకో అని పచ్చిగా ఆహ్వానించాడు ఓ అమ్మాయిని. దీనికి అర్థం అతడే చెప్పాలి. మరో సంభాషణలో నేను ఎప్పుడైనా రెడీ అని పచ్చిగా చెప్పేశాడు. అక్రమ సంబంధాలకు ద్వంద్వార్థాలతో ఆహ్వానం పలికేలా మెసేజ్‌లు రాశారు'' అంటూ ఓ టీవీ చానల్ తన తాజా కథనంలో పేర్కొంది.

డిబేట్ పెట్టిన టీవీ ఛానల్

డిబేట్ పెట్టిన టీవీ ఛానల్

తమ వద్ద ఉన్న వాట్సాప్ సందేశాల ఆధారంగా..... రాంకీని, కత్తిని స్టూడియోకి పిలిపించి డిబేట్ పెట్టారు సదరు టీవీ ఛానల్ వారు. ఈ సందర్భంగా కత్తి మహేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Recommended Video

Bigg Boss Telugu : Mahesh Kathi Write a Book on Bigg Boss House
మీ వాట్సాఫ్ సందేశాలు బయట పెడుతున్నాం

మీ వాట్సాఫ్ సందేశాలు బయట పెడుతున్నాం

మీరు వాట్సాఫ్ లో ఓ అమ్మాయితో చేసిన చాటింగుకు సంబంధించి మా వద్ద ఆధారాలు ఉన్నాయి. అవి కాసేపట్లో స్క్రీన్ మీద చూపిస్తాం. ఆ అమ్మాయి ఎవరన్నది కానీ, అందులో అభ్యంతరకరమైన పదాలు కనిపించకుండా.... స్క్రీన్ మీద ప్లే చేస్తాం. దాన్ని మీరు చూసి అది మీరు పంపిందేనా? కాదా? ఏం సందర్భంలో ఎవరికి పంపారో అమ్మాయి పేరు బయట పెట్టకుండా చెప్పాల్సి ఉంటుంది అంటూ.... మహేష్ కత్తిని సదరు డిబేట్ లో కూర్చోబెట్టి ప్రశ్నించారు.

కత్తి మహేష్‌కు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించే అర్హత ఉందా?

కత్తి మహేష్‌కు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించే అర్హత ఉందా?

ఆ వాట్సాప్ సందేశాల ఆధారంగా కత్తి మహేష్‌కు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించే అర్హత ఉందా? తన పెళ్లాన్ని కాపాడుకోలేని వాడు రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడు అంటూ ఆయన్ను ప్రశ్నించినటువంటి కత్తి మహేష్ అమ్మాయిలతో ఈ రకంగా ప్రవర్తిస్తుంటే... అతడికి స్క్రీలపై ఉన్న గౌరవం ఇదేనా అంటూ రాంకీ ప్రశ్నించిన విషయాన్ని.... ఈ డిబేట్లో యాంకర్ గుర్తు చేశారు.

అలా అయితే పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ విషయాలు మాట్లాడతాను: కత్తి

అలా అయితే పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ విషయాలు మాట్లాడతాను: కత్తి

నా గురించి ఆ విషయాలు మాట్లాడితే.... నేను పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ విషయాల గురించి కూడా మొదలు పెట్టవచ్చా? మీరు నాకు ఆ పర్మిషన్ ఇచ్చేస్తే ఆ తర్వాత ఇంకేమైనా మాట్లాడుకుందాం.... అంటూ కత్తి ఎదురు ప్రశ్నించారు.

ఏ రాజ్యాంగం నేర్పించింది

ఏ రాజ్యాంగం నేర్పించింది


ఇక్కడ నైతికతా? సమస్యా? ఒక వ్యక్తి నైతికతను ప్రశ్నించి దాని ద్వారా ఇతడికి మాట్లాడే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు అని డిస్కస్ చేయడం ఏ రాజ్యాంగం నేర్పించింది? అని కత్తి మహేష్ మండి పడ్డారు.

పవన్ కళ్యాణ్ ఎఫైర్స్ అన్నీ చెబుతాను

పవన్ కళ్యాణ్ ఎఫైర్స్ అన్నీ చెబుతాను

నాకు మీరు పర్మిషన్ ఇస్తే పవన్ కళ్యాణ్ ఎఫైర్స్ అన్నీ చెబుతాను. నేను చేసిన దానికి అతడు చేసిన అన్యాయానికి చాలా తేడా ఉంది. మాట్లాడుకుందామా? అయితే నేను రెడీ... అదే విషయం అయితే ఇక దేని గురించీ వద్దు... దాని గురించే మాట్లాడుకుందామా? అంటూ మహేష్ కత్తి ప్రశ్నించారు.

ఫాం హౌస్ విషయాలన్నీ చెబుతాను

ఫాం హౌస్ విషయాలన్నీ చెబుతాను

పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ విషయాలన్నీ చెబుతాను. ఇప్పుడున్న పెళ్లాం ఇంకా నిద్రపోతూ ఉంటే.... రాత్రి 3 గంటలకు ఎవరిని పంపడానికి తన సొంత కారు వేసుకుని పవన్ మెయిన్ రోడ్డుకు వస్తాడో మాట్లాడదాం... ఓకేనా? అంటూ కత్తి మహేష్ ప్రశ్నించారు.

అదే మీ పంథా అయితే అన్ని విషయాలు మాట్లాడుకుందాం

అదే మీ పంథా అయితే అన్ని విషయాలు మాట్లాడుకుందాం


వీళ్లు చేస్తున్నది ఏంట్రా అంటే.. నేను ఒక ప్రశ్న వేశాను. రాజకీయ ప్రశ్న. నా విబేధాలను తెలియజెప్పాను. నా మీద దాడి జరుగుతోంది. దానికి ఎదురొడ్డి ఆత్మగౌరవంతో పోరాడుతున్నాను. దీంతో నాపై మరోలా దాడి మొదలు పెట్టారు. వీడికి క్యారెక్టర్ లేదు, వీడు తాగుబోతు, తిరుగుబోతు కాబట్టి ప్రశ్నించకూడదు అంటున్నారు. అదేనా మీ పంథా? అదే మీ పంథా అయితే అన్ని విషయాలు మాట్లాడుకుందాం? అంటూ కత్తి ఆవేశంగా సమాధానం ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ గురించి అతడి ఎఫైర్ల గురించి మాట్లాడుకుందాం

పవన్ కళ్యాణ్ గురించి అతడి ఎఫైర్ల గురించి మాట్లాడుకుందాం

పవన్ కళ్యాణ్ గురంచి అతడి ఎఫైర్ల గురించి మాట్లాడుకుందాం. ఎంత మంది ప్రొడ్యూసర్లను నాశనం చేశాడు, ఎంత మంది అమ్మాయిలతో ఇతడికి ఎఫైర్ ఉంది. ఎంత మంది అమ్మాయిలను త్రివిక్రమ్ అనే డైరెక్టర్ సెటిల్మెంట్ చేసి లాస్ట్ 2 ఇయర్స్ లో పంపించాడు. వీటన్నింటి గురించి మాట్లాడుదాం...ఆ తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుదాం. దీనికి మీరు సిద్ధమేనా? అంటూ కత్తి ప్రశ్నించారు.

నేను ఏ విషయం గురించి మాట్లాడటానికి వచ్చానో

నేను ఏ విషయం గురించి మాట్లాడటానికి వచ్చానో

నేను ఏ విషయం గురించి మాట్లాడటానికి వచ్చానో ఆ విషయం గురించి మీరు మాట్లాడితే.... నేను కూడా అదే విషయం మాట్లడతాను. లేదు వేరే వాటి గురించి మాట్లాడుదాము అంటే ఇంకా చాలా మాట్లాడతాను. ఓకే అంటేనే దీన్ని మొదలు పెడతాం..... అంటూ కత్తి పైర్ అన్నారు.

నాకు ఒకే కాదు: రాంకీ

నాకు ఒకే కాదు: రాంకీ

నాకు ఒకే కాదు. ఎలా ఓకే అవుతుంది? దానికి దీనికి సంబంధం ఏమిటి? అంటూ దర్శకుడు రాంకీ అడ్డు పడ్డారు. ఇక్కడ నేను కూడా అదే అంటున్నాను.... నాపై జరుగుతున్న దాడికి, నా నైతికతకు సంబంధం ఏమిటి? అంటూ కత్తి ప్రశ్నించారు.

త్రివిక్రమ్ అనే డైరెక్టర్ కూడా ఫోన్ లైన్లోకి రావాలి

త్రివిక్రమ్ అనే డైరెక్టర్ కూడా ఫోన్ లైన్లోకి రావాలి

ఒక్క బ్రేక్ తీసుకోండి.... పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి దగ్గర నుండి తెలిసిన మనిషిని లైన్లోకి తీసుకొస్తాను. ఎన్ని ఎఫైర్ల గురించి మాట్లాడదామో మాట్లాడదాం. త్రివిక్రమ్ అనే డైరెక్టర్ కూడా ఫోన్ లైన్లోకి రావాలి అంటూ కత్తి డిమాండ్ చేశారు. దీంతో డిబేట్ మరో మలుపు తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X