»   » మెగా బ్రదర్స్‌పై కత్తి మహేష్ ఫైర్.. పవన్ కల్యాణ్ నమ్మే ముందు.. చిరంజీవి మోసం..

మెగా బ్రదర్స్‌పై కత్తి మహేష్ ఫైర్.. పవన్ కల్యాణ్ నమ్మే ముందు.. చిరంజీవి మోసం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా, పవన్ ఫ్యాన్స్, పవన్ కల్యాణ్‌పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి తన ఆరోపణలకు పదనుపెట్టారు. గతకొద్దికాలంగా పవన్ ఫ్యాన్స్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా దూరంగా ఉంటున్న కత్తి మహేష్ మరోసారి కామెంట్లు విసరడం చర్చనీయాంశమైంది.

 మౌనంగా ఉండనివ్వట్లేదు

మౌనంగా ఉండనివ్వట్లేదు

గత కొద్ది నెలలుగా పవన్ ఫ్యాన్స్‌పై కత్తి మహేష్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. పవన్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ.. పరోక్షంగాను, ప్రత్యక్షంగానూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌‌పై విమర్శలు చేస్తున్నారు. గత కొద్దికాలంగా సైలెంట్ ఉంటున్నాను. కానీ పవన్ ఫ్యాన్స్ నన్ను మౌనంగా ఉండనివ్వడం లేదు అని ఇటీవల కత్తి అన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి మెగా ఫ్యాన్స్‌పై కామెంట్లు విసిరారు.

 పవన్ కల్యాణ్‌ను నమ్మే ముందు..

పవన్ కల్యాణ్‌ను నమ్మే ముందు..

నాయుడు. రాయల్. కాపు. పిల్లల్లారా...పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా నమ్మే ముందు. చిరంజీవి కాపు కులానికి చేసిన మోసం గురించి మీ తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకొండి అని కత్తి మహేష్ ట్వీట్ చేశారు.

అసలైన లీడర్ ఆయనే

సినిమా పరిశ్రమలోను. రాజకీయాల్లోనూ కాపులకు చిరంజీవి ఫ్యామిలీ చేసింది ఏమీ లేదు. ముద్రగడ పద్మనాభం అసలైన లీడర్. వీళ్లు (మెగా బ్రదర్స్) కాదు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

పవన్‌పై కత్తి ఘాటైన వ్యాఖ్యలు

పవన్‌పై కత్తి ఘాటైన వ్యాఖ్యలు

ఇక కేంద్ర బడ్జెట్ తర్వాత కత్తి మహేష్ ఆంధ్ర రాజకీయాల్లోకి దూరం పదునైన వ్యాఖ్యలు సంధిస్తున్నారు. అవసరమైనప్పుడల్లా అన్ని పార్టీల తీరును ప్రశ్నిస్తున్నారు. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఏపీ ప్రత్యేక హోదా గురించి ఘాటైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన ఏమన్నారంటే..

నీ నిబద్ధత ఎక్కడ

"పాచిపోయిన లడ్డుల్ని"పరీక్షించడానికి నిజనిర్ధారణ కమిటీ కావాల్సి వచ్చిందా పవన్ కళ్యాణ్? ప్రత్యేకహోదాపై నీ నిబద్ధత ఎక్కడ? JAC బదులు JFFC ఎందుకొచ్చింది?ఎన్ని మాటలు మారుస్తావు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎలా ఏమారుస్తావు? అని మరో ట్వీట్‌లో ప్రశ్నించారు.

English summary
Kathi Mahesh once again criticise on Pawan Kalyan and Chiranjeevi. He question the their leadership in Kapu agitation. He said Chiranjeevi deceived Kapu community. In this sitution, Kapu leaders should not trunst pawan Kalyan politically.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu