Kathi Mahesh మరణంపై అనుమానాలు? ఆక్సిజన్ పైప్ పీకేశారా? వెంటిలేటర్ తొలగించడంపై దుమారం!
సినీ, రాజకీయ విమర్శకుడు, దర్శకుడు, నటుడు కత్తి మహేష్ మరణం కొన్ని వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేస్తే.. మరికొందరిలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అయితే ఆయన కోలుకొంటున్నారనే విషయం చాలా మంది సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల్లో సంతోషాన్ని నింపింది. అయితే అనూహ్యంగా శనివారం మధ్యాహ్నం కత్తి మహేష్ ఇక లేరనే విషయం తీవ్రమైన షాక్‌కు గురిచేసింది. అయితే ఆయన మరణంపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ..
Recommended Video

సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమే దారుణం
కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్త చాలా మందికి మనో వేదనను కలిగించింది. అయితే చేసిన పోరపాటు, అజాగ్రత్తలపై చింతించారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమే ఆయన తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఒకవేళ పెట్టుకొంటే ఇంతలా గాయపడి ఉండేవారు కాదని బాధ పడ్డారు. మహేష్ కత్తితో ప్రయాణిస్తూ కారు నడుపుతున్న సురేష్ అనే స్నేహితుడు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటం తెలిసిందే.

చెన్నై హాస్పిటల్‌లో చికిత్స
అయితే మెరుగైన చికిత్స కోసం మహేష్ కత్తిని చెన్నైకి తరలించిన తర్వాత ఆయనకు కంటి, బ్రెయిన్, ముఖంపై కలిగిన పలు గాయాలకు చికిత్స చేశారు. జూన్ 26 తేదీ నుంచి ఆయన వెంటిలెటర్‌పైనే ఉంచి చికిత్సను అందించారు. పలు చికిత్సల తర్వాత బ్రెయిన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, అలాగే రక్తస్రావం కూడా జరుగలేదనే విషయాన్ని వైద్యులు నిర్ధారించారు.

ఊపిరితిత్తుల్లో నీరు, రక్తం గడ్డకట్టడంతో
ఇక చెన్నైలోని అపోలోలో చికిత్స కొనసాగుతున్న సమయంలో మహేష్ కత్తి ఊపిరితిత్తుల్లోకి అనూహ్యంగా రక్తం, నీరు చేరడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. ఆ సమస్యను గుర్తించి వైద్యులు తగిన వైద్యం చేయడానికి సిద్ధవుతున్న తరుణంలో మహేష్ కత్తి ఈ లోకం నుంచి వెళ్లిపోవడం అందర్ని దిగ్బ్రాంతికి గురిచేసింది.

కత్తి మహేష్ మరణంపై
అయితే మహేష్ కత్తి మరణంపై సోషల్ మీడియాలోను, వెబ్ మీడియాలోను అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన మరణానికి ముందు వెంటిలేటర్ తొలగించారు? ఆక్సిజన్ అందించడం ఆపేశారనే విషయం భారీ చర్చకు దారి తీసింది. దాంతో ఆయన సన్నిహితులు మరింత విషాదానికి గురవుతున్నారు. అయితే ఆక్సిజన్, వెంటిలెటర్ తొలగింపు విషయంపై వైద్యులు నివేదిక ఇస్తే గానీ అనుమానాలకు తెరపడదనే విషాయన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు.

అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి
ఇదిలా ఉండగా, మహేష్ కత్తి అంత్యక్రియలను వాయల్పాడుకు సమీపంలోని తన స్వగ్రామంలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి కొందరు మిత్రులు ఆదివారం బయలుదేరి ఆయన స్వగ్రామానికి వెళ్లారు. సోమవారం జూలై 12 మధ్యాహ్నం లోపు మహేష్ కత్తి అంత్యక్రియలు ముగిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











