twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుర్తుంచుకోండి.. అది జరిగిన రోజు 'ఖర్చయ్యేది' పవన్ కల్యాణే: మహేష్ కత్తి

    |

    Recommended Video

    ఫ్యాన్స్..గుర్తుంచుకోండి.. 'ఖర్చయ్యేది' పవన్ కల్యాణే !

    మహేష్ కత్తి-పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నడుమ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సరికదా.. రోజుకో ఆజ్యం తోడువుతూనే ఉంది. కత్తి కామెంట్స్ చేయడం.. ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేయడం కామన్ అయిపోయింది.

    అటు సోషల్ మీడియాలోనూ, ఇటు టీవి చర్చల్లోనూ ఈ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో ఏబీఎన్ చానెల్ నిర్వహించిన ఓ డిబేట్‌లో మహేష్ కత్తి సంయమనం కోల్పోయారన్న విమర్శలు వినిపించాయి. తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చారు కత్తి మహేష్.. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

     అది నిజమే.. కానీ!:

    అది నిజమే.. కానీ!:

    ఏబీఎన్ డిబేట్‌లో నేను కొంత సంయమనం కోల్పోయానని కొందరు మిత్రులు అంటున్నారు. నిజమే. నాకు కూడా అదే అనిపించింది. అయితే అది ఏ పరిస్థితుల్లో జరిగింది అనేది కూడా గమనించాలని కోరుతున్నాను.

     కుటుంబ సభ్యులపై కూడా..:

    కుటుంబ సభ్యులపై కూడా..:

    నా మీద ఎంత హేయమైన దాడి జరుగుతున్నదో, నా వ్యక్తిగత జీవితాన్ని, నా కుటుంబ సభ్యులని, నా వృత్తిని, మొత్తంగా నా ఉనికిని న్యూనతపరుస్తూ పవన్ ఫ్యాన్స్ అన్ని చోట్లా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో గమనించాలి.

    పవన్‌ను ఎలా నమ్మాలి:

    పవన్‌ను ఎలా నమ్మాలి:

    నేను ఫేమస్ అవాలనుకుంటున్నానని.. నాకు ఏదో పార్టీ అండ ఉందని, నాకెవరో డబ్బులు ఇస్తున్నారని.. ఇలా ఎన్నెన్నో ఆరోపణలు చేస్తున్నారు. వీటిల్లో దేన్ని ఖండించకుండా నిమ్మకు నీరెత్తినట్టు తమాషా చూస్తున్న పవన్ కళ్యాణ్ మీద నాకెందుకు గౌరవం ఉండాలి? అతని రాజకీయ ఉద్దేశాల్ని ఎలా నమ్మాలి?. అక్కడా నేను వ్యక్తిగత దూషణలు చెయ్యలేదు.

     రేణుదేశాయ్ విషయం..:

    రేణుదేశాయ్ విషయం..:

    పవన్ కల్యాణ్ పర్సనల్ లైఫ్ లోకి నేను వెళ్ళలేదు. ణు దేశాయ్ విషయం పబ్లిక్ గా జరిగిన విషయం. ఫ్యాన్స్ కి బెదిరి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మూలనక్కిన ఈ వ్యక్తి గురించి నేను మాట్లాడితే వ్యక్తిగతం ఎలా అవుతుంది?. మర్యాద హద్దులు దాటుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నేను ఇంకా మర్యాదలు దాటకుండానే సమాధానం ఇస్తున్నాను.

     పవనే ఖర్చైపోతాడు..:

    పవనే ఖర్చైపోతాడు..:

    హద్దులు దాటకుండానే నేను సమాధానం చెబుతున్నాను. ఇంకా సంయమనం పాటిస్తూనే ఉన్నాను. ఆ చెలియలకట్ట తెగేదాకా తీసుకురాకండి. అది జరిగిన రోజున ఖర్చయిపోయేది పవన్ కళ్యాణ్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి-మహేష్ కత్తి.

    కత్తి వ్యక్తిగత జీవితంపై..:

    కత్తి వ్యక్తిగత జీవితంపై..:

    కత్తి మహేష్ వ్యక్తిగత జీవితంపై కూడా సోషల్ మీడియాలో దాడి జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన కుటుంబ సభ్యుల వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. అసభ్యకర రీతిలో వారిపై కొంతమంది మాటల దాడికి దిగుతున్నారు. కత్తి మహేష్ తాజా కామెంట్స్ లోనూ ఆ ఆవేదన వ్యక్తమవుతోంది.

     కత్తి కౌంటర్..:

    కత్తి కౌంటర్..:

    తాజాగా విడుదలైన అజ్ఞాతవాసి 'కొడుకా.. కోటేశ్వరరావు' పాటలో 'ఖర్చయిపోతవురో.. పులస లాగా ఎగిరిపడితే పులుసయిపోతవురో..' వంటి లిరిక్స్ ఉన్నాయి. పవన్ పాడిన ఈ లిరిక్స్ తోనే కత్తి మహేష్ ఆయనకు 'ఖర్చయిపోతావు' అంటూ కౌంటర్ ఇచ్చారు.

    కాగా తాజా ఏబీఎన్ డిబేట్‌లో 'కట్టుకున్న పెళ్లాన్నే కాపాడుకోలేనివాడు.. ఇక రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు?' అంటూ కత్తి కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

    English summary
    Film critic Mahesh Kathi given explanation over his comments on Pawan Kalyan in recent interview. Kathi said he never involved in his personal life, at the same time his fans are targeting him personally also.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X