డెడ్‌లైన్ ఓవర్, నా ఫ్యామిలీ బాధ పడుతోంది, న్యాయం చేయండి: 7 ప్రశ్నలకు సమాధానాలతో మహేష్ కత్తి!
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ విమర్శకుడు మహేష్ కత్తి మధ్య రాజుకున్న వివాదం రోజు రోజుకూ ఎక్కువ అవుతుందే తప్ప తగ్గడం లేదు. కోన వెంకట్ ట్వీట్ ను గౌరవించి జనవరి 15 వరకు నేను కామ్ గా ఉన్నాను. జనవరి 16 వచ్చింది.... నాకు న్యాయం చేయండి అంటూ మహేష్ కత్తి మళ్లీ మీడియా ముందుకొచ్చారు.

జనవరి 15 వరకు సైలెంట్
పవన్ మౌనాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని మహేష్ కత్తిని సినీ రచయిత, పవన్ కళ్యాణ్ స్నేహితుడు కోన వెంకట్ సున్నితంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులు కూడా సంయమనం పాటించాలని కోన కోరాడు. జనవరి 15 వరకు అందరూ సైలెంటుగా ఉండాలని కోన వెంకట్ సూచించారు.

కోన వెంకట్ అలా ఎందుకు ట్వీట్ చేశారు?
జనవరి 15 వరకు అంతా మౌనంగా ఉండాలని.. ఈ విషయంలో కత్తి మహేష్ కు కూడా తాను విజ్ఞప్తి చేస్తున్నా..... దయచేసి మీడియా ఛానెళ్లకు వెళ్లి చర్చల్లో పాల్గొనడం, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అభిమానులకు వ్యతిరేకంగా మాట్లాడటం చేయొద్దని కోరుతున్నానని, అలా చేస్తే శాంతి చేకూర్చాలన్న ప్రయత్నం విఫలమవుతుందని కోన ఇటీవల ట్వీట్ చేశారు. మరి కోన ఈ ప్రకటన ఎందుకు చేశారన్నది ఎవరికీ అర్థం కాలేదు.

న్యాయం చేయాలంటూ మీడియా ముందుకు కత్తి
కోన వెంకట్ ట్వీట్ ను గౌరవించి జనవరి 15 వరకు నేను కామ్ గా ఉన్నాను. జనవరి 16 వచ్చింది.... నాకు న్యాయం చేయండి అంటూ అంటూ మహేష్ కత్తి మళ్లీ మీడియా ముందుకొచ్చారు.

నా ఫ్యామిలీ బాధ పడుతోంది
నేను మా వూరికి వెళ్లడం లేదని, అందు కారణం మా ఫ్యామిలీ ఊర్లో మోసం చేసి వచ్చిందని పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రచారం చేశారని, ఈ ప్రచారం విని నా ఫ్యామిలీ బాధ పడుతోందని మహేష్ కత్తి తెలిపారు.

పర్సనల్ గా టార్గెట్ చేశారు
జనవరి 15 వరకు సైలెంటుగా ఉండమంటే సైలెంటుగానే ఉన్నా. మధ్యలో అజ్ఞాతవాసి రివ్యూ చెప్పడం తప్ప నేనేమీ మాట్లాడలేదు. ఈ గ్యాపులో పవన్ కళ్యాణ్ అభిమానులు నా క్యారెక్టర్ బ్యాడ్ గా చిత్రీకరించారని, నేను ఒక తాగుబోతు, తిరుగుబోతుగా ప్రచారం చేశారని, మా ఫ్యామిలీ ఊర్లో మోసం చేసి ఊరు విడిచి వచ్చిందని అనే నింద వేసి తప్పుడు ప్రచారం చేశారని.... తనను కావాలని పర్సనల్ గా టార్గెట్ చేశారని మహేష్ కత్తి ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలు మాట్లాడలేదని, కేవలం పొలిటికల్, సినిమా విషయాలు మాత్రమే మాట్లాడానని, తనకు న్యాయం చేయాలని మహేష్ కత్తి తెలిపారు.

పవన్ ఫ్యాన్స్ 7 ప్రశ్నలకు సమాధానాలతో మహేష్ కత్తి
1. నీ తండ్రి వ్యవసాయ అధికారిగా ఎన్ని కోట్లు మింగాడు?
ఆయన రిటైర్ మెంటుతో వచ్చిన డబ్బులతో మా ఊరిలో, మాకు ఉన్న స్థలంలో చిన్న ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. కోట్లు ఉన్నాయనేది ఫ్యాన్స్ ఊహించుకుని ఆరోపణలు చేస్తున్నారు.

రెండో ప్రశ్న, సమాధానం
2. నీ కుటుంబం గ్రామానికి ఎందుకు రాదు?
నా కుటుంబం గ్రామంలోనే ఉంది.. మా తండ్రి అక్కడే ఇల్లు కట్టుకుని ఉంటున్నారు.

మూడో ప్రశ్న, సమాధానం
3. బిగ్ బాస్ షోలో ఎంట్రీకి వైసీపీ నేత అంబటి రాంబాబు నిన్ను ఎందుకు రిఫర్ చేశారు?
బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారిని ముంబయి బృందం వచ్చి సెలెక్ట్ చేసింది. 80 మందిని ఇంటర్వ్యూ చేసి కొందరిని మాత్రమే ఎంపిక చేసింది. వాళ్లు చేసిన ఎంపికకు, అంబటి రాంబాబుకు ఏమిటి సంబంధం?

నాలుగో ప్రశ్న, సమాధానం
4. నువ్వు పవన్‌ని టార్గెట్ చేసినందుకు వైసీపీ నీకు ఎంత డబ్బు ఇచ్చింది?
నా కోసం నేను పోరాడుతుంటే, నా ఆత్మగౌరవం కోసం ప్రశ్నిస్తోంటే వైసీపీ నా వెనుక ఉందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ సామాజిక విధ్వంసకారులుగా తయారయ్యారు.

ఐదో ప్రశ్న, సమాధానం
5. గ్రామ వాసులను చిట్టీల పేరుతో నీ తల్లి ఎందుకు మోసం చేసింది?
నా తల్లి ఎన్నడూ చిట్టీలు వేయలేదు. ఆమె కేన‌్సర్‌తో రెండేళ్ల క్రితం చనిపోయింది.

ఆరో ప్రశ్న, సమాధానం
6. నువ్వు నీ సోదరి భర్తను బెదిరించి డబ్బులు లాగడానికి ఎవరు సాయం చేశారు?
ఆయన పేరు కృష్ణ భగవాన్.. ఆయన తన ఉద్యోగాన్ని చేసుకుంటూ బతుకుతుంటాడు.. నా సోదరి జీవితం ఇప్పుడు సంతోషంగా ఉంది. నన్ను దెబ్బ తీయాలనే ఉద్దేశంతో నా కుటుంబంపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు.

ఏడో ప్రశ్న, సమాధానం
7. నీ కుటుంబం ఎటువంటి తప్పూ చేయకపోతే సంక్రాంతికి సొంత గ్రామానికి ఎందుకు రాలేదు?
నేను సంక్రాంతికి నా ఊరికి వెళ్లాను.. నా తండ్రి కూడా ఆ ఊరిలోనే ఉన్నారు. అప్పుడప్పుడు నేను ఊరికి వెళ్లి వస్తూనే ఉన్నాను.


Click it and Unblock the Notifications











