చేగువేరా ఏమైనట్లు? ‘అజ్ఞాతవాసి’పై విమర్శ, స్పూప్ వీడియో!

By Bojja Kumar

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ 'అజ్ఞాతవాసి'. ఈ చిత్ర టీజర్ రిలీజైన తర్వాత సినిమా తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ జపం మొదలైంది. సినీ ఇండస్ట్రీ ప్రముఖుల ప్రశంసలతో పాటు, కత్తి మహేష్ లాంటి సినీ విమర్శకుల విమర్శలు కూడా తోడవ్వటంతో సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.

Recommended Video

ఫ్యాన్స్ ఎవరూ రియాక్ట్ అవ్వద్దు ! | Filmibeat Telugu

టీజర్ విడుదలైన తర్వాత దానికి రివ్యూ చెప్పిన కత్తి మహేష్.... తాజాగా ఫేస్ బుక్‌లో విమర్శలు చేయడంతో పాటు, 'అజ్ఞానవాసి' పేరుతో పవన్ కళ్యాణ్ మీద ఓ స్పూప్ వీడియో విడుదల చేశాడు.

చేగువేరా ఎక్కడ?

చేగువేరా ఎక్కడ?

ఒక సినిమాలో పక్కన మనిషి చెప్పులు మొయ్యాలి. మోకాలు భక్తితో పెట్టి మెట్లెక్కించే మరో సేవకుడు ఇంకో సినిమాలో...చేగువేరా ఎక్కడికి పోయాడో... ఈ బానిస ఫ్యూడల్ భావజాలాన్ని పెంపొందించే కమ్యూనిస్టు ఎవరో...హతవిధి! ఏమిటీ మీమాంస?.... అంటూ కత్తి మహేష్ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు.

ఆయన్ను ఉద్దేశించేనా?

ఆయన్ను ఉద్దేశించేనా?

పవన్ కళ్యాణ్‌కు చేగువేరా అంటే ఎంతో ఇష్టం అన సంగతి తెలిసిందే. కత్తి మహేష్ చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే అని అర్థం చేసుకోవచ్చు. పవన్ సినిమాలో చూపించే సీన్లను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

స్పూప్ వీడియో

‘అజ్ఞాతవాసి' టీజర్లో పవన్ కళ్యాణ్ ఎక్స్ ప్రెషన్స్, ఆయన గత రాజకీయ ప్రసంగాలతో ఓ స్పూప్ వీడియో తయారు చేశారు. ఈ వీడియోను కత్తి మహేష్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా షేర్ చేశారు.

సినిమాను సినిమాలా చూడాలంటున్న ఫ్యాన్స్

సినిమాను సినిమాలా చూడాలంటున్న ఫ్యాన్స్

ఒక సినిమాలో పక్కన మనిషి చెప్పులు మొయ్యాలి. మోకాలు భక్తితో పెట్టి మెట్లెక్కించే మరో సేవకుడు ఇంకో సినిమాలో... అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లను ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. సినిమాను సినిమాలా చూడాలి, దాన్ని నిజ జీవితంతో ముడి పెడితే ఎలా? అందులో సన్నివేశం ప్రకారమే అలా చేశారే తప్ప, నిజ జీవితంలో ఎవరితోనూ పవన్ కళ్యాణ్ అలాంటి పనులు చేయించుకోవడం లేదు అని అంటున్నారు.

రామ్ గోపాల్ వర్మకు నచ్చింది

రామ్ గోపాల్ వర్మకు నచ్చింది

ఆ సంగతి పక్కన పెడితే... ‘అజ్ఞాతవాసి' టీజర్‌ను ఉద్దేశించి ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఫేస్‌బుక్‌ ద్వారా స్పందించారు. ‘అజ్ఞాతవాసి' ట్రైలర్‌ అద్భుతంగా ఉంది.. పవన్‌ కళ్యాణ్‌ చాలా బాగా కనిపించారు' అని ప్రశంసించారు.

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్‌చరణ్‌ చరణ్ ఈ టీజర్ మీద స్పందిస్తూ... ‘బాబాయ్‌ ఎట్‌ హిజ్‌ బెస్ట్‌. టీజర్‌లో ఆయన ప్రతి ఎక్స్‌ప్రెషన్‌ చాలా నచ్చింది. సంక్రాంతి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా' అని వ్యాఖ్యానించారు.

దూసుకెలుతున్న టీజర్

దూసుకెలుతున్న టీజర్

శనివారం సాయంత్రం విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో సోమవారం సాయంత్రానికి కు 8.5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. 4.63 లక్షల మంది లైక్‌ చేశారు. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఒకటో స్థానంలో ఉంది.

సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్

సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి' చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. జనవరి 10న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదలవుతోంది. యూఎస్ఏలో ఈ చిత్రం రికార్డు స్థాయి స్క్రీన్లలో విడుదలవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X