ఇది నిజంగా అద్భుతమే.. కత్తి మహేష్ గుండెపై పవన్ కళ్యాణ్.. ‘పరాన్నజీవి’లో కీ రోల్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో నడిచేవి రెండే టాపిక్స్. అందులో ఆర్జీవీ పవర్ స్టార్, మరోకటి ఆర్జీవీపై రాబోతోన్న సెటైరికల్ మూవీ పరాన్నజీవి. లేటుగా ప్రారంభించినా పవన్ ఫ్యాన్స్ పరాన్నజీవిని జనాల్లోకి ఈజీగా తీసుకెళ్లగలిగారు. బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు పరాన్న జీవిని తెరకెక్కిస్తుండగా.. షకలక శంకర్ ఆర్జీవీగా నటించబోతోన్నాడు. తాజాగా మరో కీలక పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

పవర్ స్టార్‌కు పోటిగా..
పవన్ కళ్యాణ్‌ను కించపరిచే విధంగా పవర్ స్టార్ సినిమా తీస్తున్న ఆర్జీవీకి కౌంటర్ వేసే విధంగా పరాన్న జీవిని రూపొందిస్తున్నారు. పవర్ స్టార్‌కు పోటాపోటీగా పరాన్నజీవిని రిలీజ్ చేసేందుకు అంతా సిద్దం చేసుకుంటున్నారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లు ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.

వర్మగా శంకర్..
రామ్ గోపాల్ వర్మగా జబర్దస్త్ ఫేమ్ షకలక శంకర్ నటిస్తున్నాడు. ఆర్జీవీని అచ్చుగుద్దినట్టు దించడం, అతని మ్యానరిజంను ఎక్కువగా ఇమిటేట్ చేయడంలో షకలక శంకర్ దిట్ట. అందుకే ఈ పాత్రలకు అతడిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే మరో పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్ అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది.

పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా..
కత్తి మహేష్-పవన్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. పవన్ కళ్యాణ్‌పై చీటికి మాటికి సెటైర్స్ వేస్తూ ఉండే కత్తి మహేష్.. పరాన్న జీవిలో నటించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Recommended Video

కత్తి మహేష్ పోస్టర్ వైరల్..
తాజాగా రిలీజైన పవర్ స్టార్ సినిమా ట్రైలర్‌లోనూ కత్తి మహేష్ కనిపించాడు. ఇప్పుడు పరాన్నజీవిలోనూ ఓ ముఖ్య పాత్రను పోషిస్తోన్నట్టు తెలుస్తోంది. కత్తికి రెండువైపులా పదునే అన్నట్లుగా.. ఆర్జీవి సినిమాలో ధీటైన సన్నివేశాల్లో తన మార్క్ యాక్టింగ్ ని చూపిస్తాడట కత్తి మహేష్. ఇందులో కత్తి మహేష్ జేబుపై పవన్ కళ్యాణ్ ఫోటో ఉండటం చూస్తూ ఉంటే ఓ రేంజ్‌లో నటించబోతోన్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











