Adipurush సినిమాపై నిషేధం.. ప్రభాస్ మూవీకి చుక్కెదురు!
వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం వివాదాలు, నిరసనల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జూన్ 16వ తేదీన రిలీజైంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో టీ సిరీస్ అధినేతలు భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. అయితే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ నేపాల్ పురపాలక సంఘం ఇచ్చిన ప్రకటన వివరాల్లోకి వెళితే..
ఆదిపురుష్ సినిమాలో కొన్ని డైలాగ్స్ గురించి నేపాల్ మేయర్ బాలెన్ షా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో సీతను భారతీయ ముద్దు బిడ్డ అని పేర్కొనడంపై నిరసన వ్యక్తం చేశారు. సీత భారతీయురాలు కాదు. ఆ డైలాగ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశాడు. సీత గురించి ఉపయోగించిన డైలాగ్స్‌ను తొలగించేంత వరకు నేపాల్‌లో హిందీ సినిమాలు నిషేధించాలని కాట్మండు మేయర్ బాలెన్ షా పిలుపునిచ్చారు.

సీత భారతమాత ముద్దు బిడ్డ కాదు అంటూ ఖాట్మండు మేయర్ ఖండించారు. సీత నేపాల్ చెందిన ముద్దు బిడ్డ. ఆదిపురుష్ సినిమాలో వాడిన డైలాగ్స్‌ను మూడో రోజుల్లో తొలగించాలని డిమాండ్ చేశాడు. డైలాగ్ తొలగిస్తే ఆదిపురుష్ సినిమాను రిలీజ్‌కు అనుమతిస్తాం అని బాలెన్ షా పేర్కొన్నారు.
ఖాట్మండు మీడియా కథనం ప్రకారం.. నేపాల్ సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం ఆదిపురుష్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. అయితే ఈ సినిమాలోని సీత భరతమాత ముద్దుబిడ్డ అనే డైలాగ్స్ ఉందనే విషయంపై వివాదంగా మారింది. దాంతో స్థానికంగా శాంతి భద్రతల పరిస్థితి చేజారింది. దాంతో సినిమా ప్రదర్శనను నిలిపివేశారు అని పేర్కొన్నది.
జానకి డాటర్ ఆఫ్ ఇండియా అనే డైలాగ్‌ను తొలగించాలి. ఆ డైలాగ్ నేపాల్ వాసుల మనోభావాలను కించపరిచేలా ఉంది. కాబట్టి ఆ డైలాగ్స్ తొలగించే వరకు సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వం అని ఖాట్మండు మేయర్ బాలెన్ షా ట్వీట్ చేశారు. అయితే ఈ వివాదంపై స్థానికంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











