Adipurush మూవీ ఎఫెక్ట్: పెద్ద చిచ్చు పెట్టిన డైలాగ్.. అక్కడ భారత చిత్రాలు నిషేదం
'ఆదిపురుష్.. ఆదిపురుష్.. ఆదిపురుష్'.. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. అంతలా ఈ మూవీ ఎన్నో రకాలుగా ట్రెండింగ్‌లో ఉంటోంది. ముఖ్యంగా ఇది ఆరంభం నుంచే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటూ వచ్చింది. రిలీజ్ తర్వాత ఈ చిత్రంపై మరిన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాలోని ఓ డైలాగ్ చేసిన రచ్చ వల్ల తాజాగా ఓ దేశంలో ఇండియన్ సినిమాలను నిషేదించారు. అసలేం జరిగింది? దీని వెనుక అసలు విషయం ఏంటో మీరే చూసేయండి మరి!
ఆదిపురుష్‌గా మారిన ప్రభాస్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో వచ్చిన చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. అజయ్ - అతుల్ దీనికి సంగీతం అందించారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు.

ఫస్ట్ వీకెండ్‌లో భారీ వసూళ్లు: విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న 'ఆదిపురుష్' మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీనికి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఫలితంగా ఇది ఫస్ట్ వీకెండ్‌లోనే రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటుకుంది.
అలాంటి సీన్స్‌పై విమర్శలు: విజువల్ వండర్‌గా రూపొందిన 'ఆదిపురుష్' మూవీలోని కొన్ని సన్నివేశాలు మాత్రం విమర్శలకు కారణం అయ్యాయి. ముఖ్యంగా దేవుళ్లను చూపించిన లుక్స్‌పై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు, హనుమంతుడు వాడిన డైలాగులు, రావణాసురుడి పది తలలు ఇలా ఎన్నో అంశాలపై ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమాపై వ్యతిరేకత బాగా పెరుగుతూ వస్తోంది.

సీత జన్మ స్థలం డైలాగ్‌పైనా: 'ఆదిపురుష్' మూవీని ఇండియాలోని అన్ని ప్రాంతాలతో పాటు చాలా దేశాల్లో కూడా విడుదల చేశారు. అయితే, నేపాల్‌లో మాత్రం దీని విడుదల ఆగిపోయింది. దీనికి కారణం రామాయణం ప్రకారం.. సీత జనక్‌పూర్‌లో జన్మించారు. ఇది ఇప్పటి నేపాల్‌లో ఉందని అక్కడి వాళ్లు నమ్ముతారు. కానీ 'ఆదిపురుష్' సినిమాలో 'సీత భారతమాత కూతురు' అని డైలాగ్‌ను వాడారు.
మూడు రోజుల్లో మార్చాలని: దీంతో ఖాట్మండు మేయర్ బాలెన్ షా ఆ నగరంలో 'ఆదిపురుష్' మూవీ ప్రదర్శనను నిలిపివేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో 'ఆదిపురుష్ మూవీలో 'జానకీ ఈజ్ ఏ డాటర్ ఆఫ్ ఇండియా' అనే డైలాగ్ పెట్టారు. దీన్ని మా దేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ డైలాగును నేపాల్‌లోనే కాకుండా భారతదేశంలో కూడా 3 రోజుల్లో మార్చాలి' అని డిమాండ్ చేశారు.

అన్ని సినిమాలూ నిషేదం: ఖాట్మండు మేయర్ బాలెన్ షా అదే ట్వీట్‌లో 'ఆదిపురుష్‌లోని ఆ డైలాగును మార్చకుంటే ఖాట్మండు మెట్రోపాలిటన్ సిటీలో ఈ సినిమాను నిషేదించినట్లుగానే.. భవిష్యత్‌లోనూ ఏ హిందీ సినిమాను నడపడానికి అనుమతించం' అని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే థియేటర్ల యాజమాన్యాలు కూడా కట్టుబడి ఉన్నాయి. దీంతో వాళ్లు ఈ నిషేదం అమలు దిశగా సాగుతున్నారు.


Click it and Unblock the Notifications











