twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు అతిజాగ్రత్త, చెర్రీ అయోమయం, వినాయక్ ఏమీ చేయలేక...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత 150వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. ఇప్పటికే సినిమా ప్రారంభం అవ్వడం చాలా ఆలస్యం అయింది. సినిమా మొదలైన తర్వాత అయినా ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీతో సినిమా సాగుతుందా? అంటే లేదనే అంటున్నారు ఫ్యాన్స్.

    సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది కానీ దానిపై సరైన క్లారిటీ లేదు. మరో వైపు సినిమా టైటిల్ 'కత్తిలాంటోడు' అని తొలి నుండి వినిపిస్తున్నా రామ్ చరణ్ అది అఫీషియల్ టైటిల్ కాదంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. కట్ చేస్తే తాజాగా రామ్ చరణ్ అదే టైటిల్ ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించారట.

    సినిమా టైటిల్ విషయంలో నిర్మాతగా వ్యవహరిసతున్న రామ్ చరణ్‌కు సరైన క్లారిటీ లేక పోవడం.... మొన్నటికి మొన్న అబ్బే ఆ టైటిల్ కాదండీ అంటూ ప్రకటన చేసి ఇపుడు అదే టైటిల్ రిజిస్టర్ చేయించడం అభిమానుల్లో అయోమయానికి దారి తీస్తోంది.

    అఫ్ కోర్స్ రామ్ చరణ్ టైటిల్ రిజిస్టర్ చేయించినంత మాత్రాన అదే టైటిల్ చిరంజీవి 150వ సినిమా పెడతారనే గ్యారంటీ ఏమీ లేక పోయినా.... మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ప్రతిష్టాత్మక 150వ చిత్రం విషయంలో ఓ క్లారిటీ అంటూ లేకుండా చిత్ర యూనిట్ ముందుకు సాగుతుండటంతో సినిమా అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులను నిరాశ పరిచినట్లవుతోంది.

    ఇదీ కాక...సినిమా ప్రారంభం అయినా ఇప్పటికీ హీరోయిన్ ఎవరనే విషయం ఖరారు కాలేదు. ఇలా ఓవరాల్ గా నిర్మాత రామ్ చరణ్ తీరు విమర్శలకు దారి తీస్తోంది...

    వివి వినాయక్ నామమాత్రమే...

    వివి వినాయక్ నామమాత్రమే...

    సాధారణంగా బయట నిర్మాతలతో చేసేప్పుడు దర్శకుడు వివి వినాయక్ చాలా స్వతంత్రంగా వ్యవహరించేవాడు. కానీ ఈ సినిమా విషయానికొచ్చే సరికి చిరంజీవి, రామ్ చరణ్ డామినేషనే నడుస్తుండటంతో వినాయక్ కేవలం డైరెక్షన్ పనులకే పరిమితం అయి నామమాత్రపు పాత్ర వ్యవహరించాల్సి వస్తోంది.

    చిరంజీవి అతి జాగ్రత్త

    చిరంజీవి అతి జాగ్రత్త

    చిరంజీవి కూడా ఈ సినిమా విషయంలో చాలా అయోమయంలో ఉన్నాడు. ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా, ఈ సినిమా తేడా వస్తే తన మెగా ఇమేజ్ దెబ్బతింటుందనే కారణంతో ప్రతి విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడట.

    ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో..

    ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో..

    చిరంజీవి ముందు నుండి ఎలాంటి కథ ఎంచుకోవాలనే దానిపై అయోమయంలోనే ఉన్నారు. మరీ సందేశాత్మకంగా తీస్తే మరీ ఓవర్ అవుతుందని, పూర్తి కమర్షియల్ గా చేస్తే ఈ వయసులో ఇలాంటి ఏదైనా తేడా కొడుతుందేమో అనే భయంలో ఉండిపోయారట.

    రీమేక్

    రీమేక్

    ఇప్పటికే చిరంజీవి చేస్తున్నది రీమేక్ కావడంతో కొందరు సినీ సెలబ్రిటీలు ఆల్రెడీ విమర్శలు చేసారు. సినీ జనాల్లో కూడా ఇది రీమేక్ అనే ముద్ర బలంగా పడిపోయింది.

    వర్కౌట్ అయితే ఓకే..

    వర్కౌట్ అయితే ఓకే..

    రీమేక్ వర్కౌట్ అయితే ఓకే కానీ... రేపు ఏదైనా తేడా వస్తే విమర్శలు వస్తాయి. సీన్ టు సీన్ తీస్తే మక్కీకి మక్కీ తీసారనే విమర్శలు, ఏదైనా మార్పులు చేస్తే చెడగొట్టారనే విమర్శలు వస్తాయనే విమర్శలు వస్తాయనే భయంతోనే అతి జాగ్రత్తగా సినిమా తీస్తున్నారు.

    కేవలం చిరు ఇమేజ్

    కేవలం చిరు ఇమేజ్

    కేవలం చిరంజీవి ఇమేజ్ బేస్ చేసుకుని సినిమాను తీస్తున్నారు. పదేళ్ల క్కితం క్రితం చిరంజీవికి ఉన్న క్రేజ్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? అనే అనుమానాలు సైతం ఉన్నాయి.

    క్లారిటీ లేక పోవడమే..

    క్లారిటీ లేక పోవడమే..

    చిరంజీవి 150వ సినిమా ముందు నుండీ సరైన క్లారిటీ లేకుండా సాగడమే ఈ అనుమానాలన్నింటికీ కారణం.

    అభిమానుల్లో ఉత్కంఠ

    అభిమానుల్లో ఉత్కంఠ

    ఓ వైపు అభిమానుల్లో సినిమా ఎలా ఉండబోతోందో? అనే ఉత్కంఠ... మరో వైపు సినిమా టీం క్రియేట్ చేస్తున్న అయోమయం వెరసి సినిమా రిజల్టు ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అనేది చర్చనీయాంశం అయింది.

    కొట్టుకు పోతుందా?

    కొట్టుకు పోతుందా?

    ఇవన్నీ ఎలా ఉన్నా సినిమా విడుదల సమయానికి వచ్చే సరికి చిరంజీవి హైప్ లో కొట్టుకుపోతాయని, కబాలి తరహాలో మంచి ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకంతో ఉన్నారు.

    English summary
    Recently the title Kaththilantodu was registered at Film Chamber of Commerce in Hyderabad on Konidela Productions banner. Producer Ram Charan has registered this title. We will have to wait and watch if this will be the final one
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X