ఆమెను బూతు బొమ్మలా చూడొద్దు
కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీలియోన్‌ను తప్పుగా చూడొద్దని, ఆమెపై ఇంత రాద్దాంతం అవసరం లేదని ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు కట్జూ వ్యాఖ్యానించారు. ఆమెకు సపోర్టుగా మాట్లాడిన కట్జూ... కెనడాలో ఉన్నప్పుడు బ్రతుకు దెరువు కోసం ఆమె అక్కడి సాంప్రదాయాలకు, అక్కడి చట్టాలకు సమ్మతమైన ఫోర్న్ చిత్రాల్లో నటించినప్పటికీ....భారత్ లో బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి వచ్చిన తర్వాత హద్దు మీరలేదని అన్నారు. ఆమె ఇక్కడి రావడం వల్ల ఇక్కడి సమాజానికి ఎలాంటి నష్టం కలగడం లేదని, ఆమెపై మీడియలో జరుగుతున్న ప్రచారమే ఇక్కడి సమాజంలో కొత్త ఆలోచనలకు తెరతీస్తుందని అభిప్రాయ పడ్డారు.
సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో ద్వారా కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీలియోన్‌ను భారత్ కు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆమె వస్తుందనే వార్త తెలియగానే మీడియాలో నానా హంగామా మొదలైంది. ఆమె వల్ల భారతీయ సమాజంలో చెడు పోకడలు పోతాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా. అయినా సరే సన్నీని కలర్స్ షోలో ప్రవేశ పెట్టారు నిర్వాహకులు. ఈ షోలో సన్నీ ఇతరుల మాదిరే భారతీయ కట్టుబాట్లకు లోబడి బుద్దిగానే నటించింది.
మీడియా పుణ్యమా అని భారత్ లో బారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సన్నీ....మహేష్ భట్ నిర్మిస్తున్న జిస్మ్-2 చిత్రంలో అవకాశం కూడా దక్కించుకుంది. గతంలో జాన్ అబ్రహం-బిపాస బసు జంటగా నటించిన జిస్మ్ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.


Click it and Unblock the Notifications











