హాట్ లేడీ కత్రినా మరో రికార్డ్...సత్తా చాటిన త్రిష
ముంబై : హాట్ లేడీ కత్రినా మరోసారి రికార్డ్ సృష్టించింది. వరుసగా రెండో ఏడాది కూడా అత్యధికంగా మొబైల్ నుంచి డౌన్‌లోడ్ అయిన సెలబ్రిటీగా నిలిచింది. ఆమె నటించిన 'అగ్నిపథ్' చిత్రంలోని 'చికిని చమేలీ' సాంగ్ ఈ సంవత్సరంలో అత్యధికంగా డౌన్ లోడ్ అయిన సాంగుగా నెం.1 పొజిషన్ అందుకుంది. దేశంలో టాప్ సెల్యూలార్ సంస్థగా కొనసాగుతున్న భారతి ఎయిర్ టెల్ 2012 సంవత్సరానికిగాను ఈ వివరాలు విడుదల చేసింది.
దేశ వ్యాప్తంగా ఆ సంస్థకు 186 మిలియన్ల కష్టమర్లు ఉన్నారు. వారు డౌన్ లోడ్ చేసిన వివరాలను బట్టి ఈ సర్వే నిర్వహించినట్లు భారతి ఎయిర్ టెల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి త్రిష తన సత్తా చాటింది. టాప్ 5 బాలీవుడ్ హీరోల కంటే త్రిషను 325 పెర్సంట్ ఎక్కువగా డౌన్ లోడ్ చేసుకున్నారట.
ఇక గత సంవత్సరం రికార్డు స్థాయిలో 18 రోజుల్లో 2,10,000 డౌన్ లోడ్స్ అయిన 'కొలవెరి డి' సాంగు ఈ సంవత్సరం కూడా తన జోరు కొనసాగించింది. ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన 'గంగనమ్ స్టైల్' భారత్ లో పెద్దగా పాపులర్ కాలేదు. ఈ పాట లోకల్‌గా పాపులర్ అయిన కొలవెరి సాంగును బీట్ చేయలేకపోయింది.
ఇక భారత్ లో మొబైల్ ఇంటర్నెట్ ఎక్కువగా రాత్రి టైంలోనే ఉపయోగిస్తున్నారట. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు చూడటం, సినిమా తారల ఫోటోలు చూడటం, డౌన్ లోడ్ చేసుకోవడం, అప్లికేషన్స్ డౌన్ లోడ్ చేసుకోవడం, గేమ్స్ ఆడటం, మ్యూజిక్ వినడం, వార్తలు చదవడం లాంటివి చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











