కత్రినా 'బ్లూ' ఫిల్మ్కు కోటిన్నర

శ్రీ అష్టవినాయిక ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు వందకోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.తెరపై ఐదు నిముషాలు కనిపించే ఓ పాట,రెండు సన్నివేశాల కోసం ఆమెకు దాదాపు కోటిన్నర చెల్లిస్తున్నట్లు సమాచారం. మొదట అసలు ఐటం గర్ల్ గా చేయమంటే కత్రినా రిజెక్టు చేసిందిట. అయితే వారు ఆఫర్ చేసిన డబ్బుని మాత్రం కాదనలేకపోయిందిట. అయితే ఐటం సాంగ్ చేస్తున్న విషయాన్ని ఆమె ఖండిస్తోంది. నేను బ్లూ సినిమా కోసం వెరీ స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వనున్నాను. దాన్ని నేను ఐటం సాంగ్ అని పిలవను. అయినా నేను ఈ వీరి షూటింగ్ కోసం పది రోజులు కేటాయిస్తున్నాను. అయితే పాట అయితే ఏడురోజులు సరిపోతుందని కదా అని వాదనకు దిగుతోంది.


Click it and Unblock the Notifications











