లవర్ కి ట్విస్ట్ ఇచ్చే పనిలో ఆ స్టార్ హీరోయిన్
''నేను ఎవర్నీ ప్రేమించడం లేదు. నేనింకా ఒంటిరిగానే ఉన్నాను. ఇంతకు మించి ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడను. ఆ అవసరం అంత కంటే లేదు. అంటోంది కత్రినా కైఫ్. ఆమె..సల్మాన్ ఖాన్ ప్రియురాలి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఏం జరిగిందో ఏమో కత్రినా ఇలా విరుచుకుపడుతోంది. అందులోనూ సల్మాన్ రీసెంట్ గా మరో హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేసి ఆమెతో చెట్టాపట్టాలు వేసుకుతిరగటం, అసిన్ తో అతిగా ఉండటం ఆమెకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. దాంతో ఇలా రెచ్చిపోయి ప్రకటనలిస్తోంది. అలాగే ఆమె మాట్లాడుతూ..అయినా గత ఆరు సంవత్సరాలుగా ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నానని నేను చెప్పలేదు. లేని పోని పుకార్లు వస్తున్నాయి. అందుకే ఈ సమాధానం. ఇలాంటి కొన్ని విషయాల గురించి కచ్చితమైన నిర్ణయానికి రావడం చాలా కష్టం. వచ్చాకా మనలో దాచుకునే కంటే బయటికి చెప్పేస్తేనే మంచిదని నా అభిప్రాయం అందామె. ఇవన్నీ విని మళ్ళీ సల్మాన్ దారికి వస్తాడో..లేక పూర్తిగా తెంపేసుకుంటాడో చూడాలి. ఇక కత్రినా గతంలో తెలుగులో అల్లరిపిడుగు, మల్లీశ్వరి చిత్రాలు చేసింది.


Click it and Unblock the Notifications











